విషాదం మిగిల్చిన వరదలు..చనిపోయినవారు ఎందరో! తెలంగాణ వ్యాప్తంగా వరదలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశాయి. ఎంతో మందిని దిక్కులేని వారిని చేశాయి. కట్టుబట్టలతో పునరవాస కేంద్రాల్లో నిలబెట్టాయి.కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 30 మందిని బలి తీసుకుంది ఈ వాన. By Bhavana 29 Jul 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ వ్యాప్తంగా వరదలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశాయి. ఎంతో మందిని దిక్కులేని వారిని చేశాయి. కట్టుబట్టలతో పునరవాస కేంద్రాల్లో నిలబెట్టాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 30 మందిని బలి తీసుకుంది ఈ వాన. ఎంతో మంది తమ కుటుంబాలు, కట్టుబట్టలతో మిగిలారు. గూడు కోల్పోయి, మనిషికి మనిషికి సంబంధం లేకుండా చేసి నిలబెట్టాయి. ఎన్నో గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1000 కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. 2 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటికీ ఇంకా కొన్ని జిల్లాలు నీటిలో నానుతునే ఉన్నాయి. గోదావరి ముంపు బాధితులు పునరావస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో కరెంట్ లేక, రహదారుల నిండా బురద పేరుకుపోయి ఎటో పోవాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాయి. చీకట్లోనే మగ్గిపోతున్నారు. సాయం చేసేవారి కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఆఫీసర్లెవరూ ముంపు గ్రామాల వైపు కానీ, కాలనీల వైపు కానీ కన్నెత్తి చూడడం లేదు. కనీసం కరెంట్ ఆఫీసర్లు కానీ, బల్దియా ఆఫీసర్లు కానీ కనీసం ఫోన్లు ఎత్తకపోవడంతో ప్రజలు మండిపోడుతున్నారు. వరదల వల్ల సుమారు 16 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. గత మూడు రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో జనం గల్లంతు కాగా వారిలో కొందరి మృతదేహాలు మాత్రమే దొరికాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం లో జంపన్న వాగు పొంగడంతో సుమారు 19 మంది గల్లంతయ్యారు. వారిలో కేవలం 8 మంది మృతదేహలు మాత్రమే దొరికాయి. అయితే ఇది కేవలం అధికారుల లెక్కలు . స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గల్లంతైన వారి సంఖ్య ఇంకా అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తుంది. #telangan #crime #flods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి