AP: దుప్పి వేటగాడి అరెస్టు.. ఎలా పట్టుకున్నారంటే?

నెల్లూరు జిల్లా బైరవరంలో దుప్పి వేటగాడిని అధికారులు అరెస్టు చేశారు. బొమ్మసాని వెంగయ్య అనే వ్యక్తి అటవీ ప్రాంతంలో మూడు నెలలుగా దుప్పులను వేటాడి.. వాటి మాసం విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు అతడిపై నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

New Update
AP: దుప్పి వేటగాడి అరెస్టు.. ఎలా పట్టుకున్నారంటే?

Nellore: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం బైరవరంలో దుప్పి మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని ఉదయగిరి అటవీ గోశాఖ అధికారులు రెండ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడు బొమ్మసాని వెంగయ్య.. గత మూడు నెలలుగా అటవీ ప్రాంతంలో దుప్పులను వేటాడి విక్రయిస్తూన్నట్టు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అతనిపై అధికారులు నిఘా పెట్టారు.

నిందితుడు గ్రామంలో మాంసం విక్రయిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విచారణ అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి మూడు కత్తులు, వలలు, విద్యుత్ వైర్లు, దుప్పి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా దుప్పి, ఇతర అటవీ జంతువులను వేటాడి వాటి మాసం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు