/rtv/media/media_files/2025/04/22/JKuK3XmBqtTzT049Vfy4.jpg)
attack jammu
జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్ చేశారు.
సీఎం చంద్రబాబు..
టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి..
పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు.
కిషన్ రెడ్డి..
ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు.
గజేంద్ర సింగ్ షెకావత్..
ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi
Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘
Mohan Bhagwat: రిజర్వేషన్ల రద్దు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఫైర్
రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని అన్నారు. అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయంలో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Mohan Bhagwat: రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని అన్నారు. అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయంలో మాపై (ఆర్ఎస్ఎస్) తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల వరుసగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ALSO READ: కరెంట్ పోయిందని కాదు.. పవర్ పోయిందని.. కేసీఆర్‌పై జగ్గారెడ్డి సెటైర్లు
ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటి కల్లా రిజర్వేషన్లు సమూలంగా రద్దు చేసేందుకు మోడీ అమిత్ షా ద్వయం ప్రయత్నిస్తోందని అందుకోసమే 400 ఎంపీ సీట్లను బీజేపీ అడుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రియాక్ట్ అయ్యారు.
స్వార్థంతో ఆర్ఎస్ఎస్‌పై మాట్లాడుతున్నారని, ఇదంతా దుష్ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు. వివాదం సృష్టించి లబ్ధిపొందాలని చూస్తున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని ఎవరికోసం అయితే రిజర్వేషన్లు కేటాయించబడ్డాయో వారు అభివృద్ధి చెందేవరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని అన్నారు.
J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్
జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి
ఒంగోలులో మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో మంగళవారం దారుణం జరిగింది. ఓ మహిళపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
DC vs LSG : రాణించిన మార్క్రమ్, మార్ష్.. ఢిల్లీ టార్గెట్ 160
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటింగ్ 6 వికెట్ల నష్టానికి 159 Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Pahalgam attack: మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలి.. కాల్పుల ముందు టెర్రరిస్ట్ మాటలు (VIDEO)
జమ్మూ కాశ్మీర్ టెర్రర్ అటాక్‌పై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
J&K Terror Attack: 'పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు'
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌లో 27మంది మృతి చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
LSG VS DC: లక్నో పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన!
J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్
Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి
Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి