PM Modi: రేపు ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం.. ఢిల్లీలో నో ఫ్లయింగ్‌ జోన్‌

మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. ఆదివారం రాత్రి 7–15 గంటలకు ప్రధానమంత్రి, ఇతర మంత్రి మండలి సభ్యులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో 9, 10 తేదీల్లో ఢిల్లీలో నో ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించారు.

New Update
PM Modi: రేపు ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం.. ఢిల్లీలో నో ఫ్లయింగ్‌ జోన్‌

PM Modi: మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. ఆదివారం రాత్రి 7–15 గంటలకు ప్రధానమంత్రి, ఇతర మంత్రి మండలి సభ్యులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారని రాష్ట్రపతి భవన్‌ నుంచి శుక్రవారం రాత్రి అధికారిక ప్రకటన వెలువడింది. కాగా అంతకు ముందు మోదీని NDA పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నట్లు, ఆయనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కూటమికి చెందిన నేతలందరూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి సంయుక్త లేఖను సమర్పించిన విషయం తెలిసిందే.

నో ఫ్లయింగ్‌ జోన్‌..

ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో 9, 10 తేదీల్లో నో ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించారు. రాష్ట్రపతితో భేటీ తర్వాత బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తన నివాసంలో మిత్రపక్షాల నేతలతో వేర్వేరుగా చర్చలు జరిపారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్‌, ఏక్‌నాథ్‌ షిండే, పవన్‌ కళ్యాణ్, చిరాగ్‌ పశ్వాన్‌, జయంత్‌ చౌదరి, అనుప్రియ పాటిల్‌, అజిత్‌ పవార్‌లు నడ్డాతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం, JDUలకు రెండు కేబినెట్‌, రెండు సహాయ మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. శివసేన, లోక్‌ జనశక్తిల పార్టీలకు ఒక కేబినెట్‌, ఒక సహాయ మంత్రి పదవి చొప్పున ఇచ్చే అవకాశాలున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు