Pariksha Pe Charcha 2024: మోదీ పరీక్షా పే చర్చ..ఈవెంట్ కు అనూహ్య స్పందన..కోటికిపైగా రిజిస్ట్రేషన్లు..!!

ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించనున్న పరీక్ష పే చర్చ ఈవెంట్ కు భారీగా రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి. జనవరి 12 రాత్రి 7గంటల వరకు దేశవ్యాప్తంగా 1.95లక్షల మందికిపైగా రిజిస్ట్రషన్లు అయ్యాయి.

New Update
Pariksha Pe Charcha 2024 : మోదీతో పరీక్షా పే చర్చ తేదీ ఖరారు...ఎప్పుడంటే?

Pariksha Pe Charcha 2024:  విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (pm modi) ప్రతిఏటా నిర్వహించే ఈవెంట్ పరీక్షపే చర్చ (Pariksha Pe Charcha). ఈ సంవత్సరం కూడా నిర్వహించబోయే ఈ ఈవేంట్ కు భారీ సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం కోసం అధికారిక వెబ్ సైట్ https://www.mygov.in/ppc-2024/లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ వెబ్ సైట్లో పేర్కొన్న గణాంకాల ప్రకారం..జనవరి 12 రాత్రి 7గంటల వరకు దేశవ్యాప్తంగా 1.95కోట్ల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులతోపాటు 14.33లక్షల మంది ఉపాధ్యాయులు, 5.30లక్షల మందికిపైగా తల్లిదండ్రులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇక రిజిస్ట్రేషన్ల గడువు నేటితో ముగియనుంది. అయితే పరీక్షా పే చర్చ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందనే తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

ఇది కూడా చదవండి: ఆర్మీ వాహనాలపై ముష్కరుల కాల్పులు..తిప్పి కొట్టిన జవాన్లు..!!

అటు భారతదేశపు అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(Reliance Industries Limited) గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ప్రోగ్రామ్‌(Graduate Engineer Trainee Programme)ను ప్రారంభించింది. ఇది పెట్రోకెమికల్స్(Petrochemicals) నుండి కొత్త ఎనర్జీ (New energy)వరకు వ్యాపారాలలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్లను నియమించుకునేందుకు ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్(Recruitment drive) నిర్వహిస్తోంది. యువ ఇంజనీర్ల కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) 2024 ప్రోగ్రామ్ పేరుతో తన ఎంట్రీ-లెవల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా పెట్రో కెమికల్ నుంచి న్యూ ఎనర్జీ వరకు రిలయన్స్ కు చెందిన పలు వ్యాపార విభాగాల్లో ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొంది. 

ఈ ఏడాది తొలిసారిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ చేపట్టింది కంపెనీ. ఈ ప్రోగ్రామ్ కోసం రిజిస్ట్రేషన్ జనవరి 11 నుండి జనవరి 19వరకు నమోదు చేసుకోవచ్చిన తెలిపింది. బి.టెక్, బి.ఇ. విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2024 బ్యాచ్‌లో AICTE- ఆమోదించబడిన సంస్థల నుండి రసాయన, విద్యుత్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి వివిధ స్ట్రీమ్‌ల నుండి గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నిర్ణయించింది.

మార్చి 1 వరకు ఇంటర్వ్యూ :
షార్ట్‌లిస్ట్ చేయబడిన విద్యార్థులు ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 8 మధ్య ఆన్‌లైన్ మూల్యాంకనం (కాగ్నిటివ్ టెస్ట్ మరియు సబ్జెక్ట్ మ్యాటర్) చేయించుకోవాల్సి ఉంటుందని రిలయన్స్ తెలిపింది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఫిబ్రవరి 23 నుండి మార్చి 1 వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూకి పిలుస్తారు. మార్చి చివరి నాటికి తుది ఎంపిక జరుగుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు