KC Venugopal: నా ఫోన్ హ్యాక్ చేశారు.. మోదీపై కేసీ వేణుగోపాల్ విమర్శలు

కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. మోదీ ప్రభుత్వం తన ఫోను ట్యాప్ చేసిందని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన, గోప్యతకు భంగకరమైన చర్యలను గట్టిగా వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు.

New Update
KC Venugopal: నా ఫోన్ హ్యాక్ చేశారు.. మోదీపై కేసీ వేణుగోపాల్ విమర్శలు

KC Venugopal: కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. మోదీ ప్రభుత్వం తన ఫోను ట్యాప్ చేసిందని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన, గోప్యతకు భంగకరమైన చర్యలను గట్టిగా వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. ఈ మేరకు యాపిల్‌ సంస్థ నుంచి తనకు వచ్చిన అప్రమత్తత సందేశాన్ని ట్విట్టర్ (X)లో పోస్ట్‌ చేశారు. 'మీ యాపిల్ ఐడీతో ఉన్న ఐఫోన్ ను రిమోట్ గా హ్యాక్ చేసేందుకు కిరాయి స్పైవేర్ తో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరెవరు? ఏం చేస్తున్నారు? అనేవి తెలుసుకునే లక్ష్యంతోనే ఈ దాడి జరుగుతున్నట్లుగా భావిస్తున్నాం అని ఆపిల్ సంస్థ పంపిన మెయిల్ లో ఉంది.

ఈ హెచ్చరిక నేపథ్యంలో వేణుగోపాల్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 'మీకెంతో ఇష్టమైన స్పైవేర్ ను నా ఫోను కూడా పం పించినందుకు మోదీ జీ మీకు కృతజ్ఞతలు. మీరు పంపించిన ప్రత్యేక బహుమతి గురించి యాపిల్ సంస్థ నాకు సమాచారమిచ్చింది. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడేందుకు, వారి గోప్యతకు భంగం కలిగించేందుకు మీరు నేరపూరితంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది' అని రాసుకొచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు