Keeravani : తెలంగాణ రాష్ట్ర గీతానికి కీరవాణి మ్యూజిక్

తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ పాటకు ఆస్కార్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వర కల్పన చేయనున్నారు. ఈ రోజు సీఎం రేవంత్ తో కీరవాణి, గీత రచయిత అందెశ్రీ భేటీ అయ్యారు. ప్రతీ ఒక్కరూ పాడుకునేలా సంగీతం, స్వరకల్పన చేయాలని కీరవాణిని సీఎం కోరారు.

New Update
Keeravani : తెలంగాణ రాష్ట్ర గీతానికి కీరవాణి మ్యూజిక్

Telangana : జయ జయహే తెలంగాణ (Jaya Jaya He Telangana).. అంటూ సాగే తెలంగాణ రాష్ట్ర గీతం త్వరలో ప్రజల ముందుకు రానుంది. ఆస్కార్ అవార్డు (Oscar Award) అందుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (M. M. Keeravani) ఈ గేయానికి సంగీతం అందించనున్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో రచయిత, నేపథ్య గాయకుడు అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి భేటీ అయ్యారు. ప్రతీ ఒక్కరూ పాడుకునేలా సంగీతం, స్వరకల్పన చేయాలని కీరవాణిని సీఎం కోరారు. గేయ రచయిత అందెశ్రీ, కీరవాణిని ఈ సందర్భంగా సీఎం రేవంత్ సన్మానించారు. అయితే.. జూన్ 2న రాష్ట్ర అవతరణ నాటికి ఈ గీతం విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read : భ్రూణ హత్యలు దురదృష్టకరం.. కేసరి అప్పారావు ఎక్స్ క్లూజివ్

Advertisment
Advertisment
తాజా కథనాలు