MM Keeravani Birthday : 'అసిస్టెంట్' నుంచి 'ఆస్కార్' వరకు.. కీరవాణి సంగీత ప్రస్థానం ఇదే!

సినీ సంగీత ప్రపంచంలో సరికొత్త ఒరవడిని సృష్టించిన దిగ్గజ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి గురించి పరిచయం అక్కర్లేదు.. తన పాటలతో సంగీత ప్రియుల్ని అలరించిన ఈయన నేడు (జులై 4) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
MM Keeravani Birthday : 'అసిస్టెంట్' నుంచి 'ఆస్కార్' వరకు.. కీరవాణి సంగీత ప్రస్థానం ఇదే!

MM Keeravani Birthday Special Story : సినీ సంగీత ప్రపంచంలో తన పాటలతో సరికొత్త ఒరవడిని సృష్టించిన దిగ్గజ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా తన మ్యూజిక్ తో సంగీత ప్రియుల్ని అలరించిన ఈయన నేడు (జులై 4) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టి...

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి వరుసకు సోదరుడైన కీరవాణి భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకులలో ముందువరుసలో ఉంటారు. ఎంఎం కీర‌వాణి అస‌లు పేరు కోడూరి మ‌ర‌క‌త‌మ‌ణి కీర‌వాణి (Koduri Marakathamani Keeravani). 1961లో జూలై 4న పుట్టారు. 1987వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ గా కీరవాణి కెరీర్ని మొదలుపెట్టారు. ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ వారు 1989లో నిర్మించిన మనసు - మమత తెలుగు చిత్రం ద్వారా ఎం. ఎం. కీరవాణి ప్-పేరుతో సంగీత దర్శకునిగా వెండి తెరకు పరిచయమయ్యాడు.

publive-image

క్షణ క్షణంతో బ్రేక్...

కీరవాణికి సంగీత దర్శకుడిగా బ్రేక్ వచ్చింది మాత్రం ‘క్షణక్షణం’ సినిమాతోనే. వెంకటేశ్, శ్రీదేవి జంటగా రామ్‌గోపాల్ వర్మ్ తీసిన ఈ సినిమా సక్సెస్‌లో కీరవాణి మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత ఆయనకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఘరానా మొగుడు, అల్లరి మొగుడు, క్రిమినల్, ఆపద్బాంధవుడు, అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, శుభ సంకల్పం, రాంబంటు, ఒకరికి ఒకరు, నేనున్నాను.. వంటి సినిమాలకు అదిరిపోయే ఆల్బమ్స్ అందించి అగ్ర సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడిగా...

రాజమౌళితో చేసే ప్రతి సినిమాకీ కీరవాణి అదిరిపోయే మ్యూజిక్ ఇస్తుంటారు. రాజమౌళి ప్రతి సినిమాకీ సంగీతం అందించేది ఆయనే. స్టూడెంట్ నం 1, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి (Bahubali), ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ (RRR).. ఇలా ప్రతి మూవీ మ్యూజికల్ హిట్టే. కీరవాణి ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం దర్శకుడు రాఘవేంద్రరావుతో. వీరి కాంబినేషన్‌లో ఏకంగా 27 సినిమాలొచ్చాయి. వాటిలో చాలా సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.

publive-image

ఇతర భాషల్లోనూ...

కీరవాణి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ వర్క్ చేశారు. ఏ భాషలో చేసినా అక్కడి ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వడం ఆయన స్పెషాలిటీ. హిందీలో అయితే బెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చారు. అక్కడ ఎం.ఎం.క్రీమ్ పేరుతో అక్కడ అద్భుతమైన పాటలు అందించారు. తమిళంలోనూ మరకతమణి పేరుతో పలు సినిమాలకు మ్యూజిక్ కంపోజ్చేశారు. అలా అన్ని భాషలు కలిపి సుమారు 250 కి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకుల్ని అలరించారు.

publive-image

బాహుబలితో మరింత క్రేజ్...

'బాహుబలి' సినిమాతో కీరవాణి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవ్వడంలో కీరవాణి సంగీతం కీలక పాత్ర పోషించింది. ఫలితంగా ఈ సినిమాకెంత పేరు వచ్చిందో ఆయన సంగీతానికీ అంతే పేరొచ్చింది. ఇక గత ఏడాది 'RRR' తో కీరవాణి సంగీతం ప్రపంచ వ్యాప్తమైంది. ఈ సినిమాలో కీరవాణి కంపోజ్ చేసిన 'నాటు నాటు' సాంగ్ ఆస్కార్ అవార్డు సాధించింది. దాంతో ఎం.ఎం. కీరవాణి కాస్త ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణిగా మారారు.

MM Keeravani

ఎన్నో అవార్డులు...

1997 లో వచ్చిన 'అన్నమయ్య' చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు. బాహుబలి రెండు భాగాలకుగాను నంది అవార్డులు వరించాయి. ‘అళగన్’ అనే సినిమాకి తమిళనాడు స్టేట్ అవార్డు దక్కింది. రెండుసార్లు సైమా అవార్డ్, ఏడుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకున్నారు. ఇప్పటివరకూ 8 నంది అవార్డులు గెలుచుకున్నారు. RRR సినిమాలో కీరవాణి కంపోజ్ చేసిన 'నాటు నాటు' సాంగ్ (Naatu Naatu Song) ఆస్కార్ అవార్డు (Oscar Award) సాధించింది.

#mm-keeravani #mm-keeravani-birthday
Advertisment
Advertisment
తాజా కథనాలు