/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/zakia.jpg)
YCP MLC Zakia Khanam : ఎన్నికల్లో (Elections) ఓటమి చెందిన మాజీ సీఎం జగన్ (Ex. CM Jagan) కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీ (YCP) కి రాజీనామా చేసే ఆలోచనలో ఆ పార్టీ ఎమ్మెల్సీ జకీయా ఖానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. విజయవాడలో మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ (NMD Farooq) ని కలిశారు శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకీయా ఖానం (Zakia Khanam). మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ను సన్మానించారు. దీంతో ఆమె త్వరలో వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. కాగా పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించకపోవడంతో ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే, మరి ఆమె పార్టీ మారుతారా? లేదా? అనేది వేచి చూడాలి.
Also Read : భారత్ లో నియంత్రణలోనే జనాభా పెరుగుదల.. పాప్యులేషన్ పై స్పెషల్ స్టోరీ
మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌తో వైసీపీ ఎమ్మెల్సీ జకీయా ఖానం