కాంగ్రెస్‌ను నమ్మితే కన్నీళ్లే మిగులుతాయి.. ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి కాంగ్రెస్ పై సంచలన కామెంట్స్ చేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ కాంగ్రెస్ నేతల సమావేశాలు మాత్రమే జరిగాయని ఎద్దేవా చేశారు. By srinivas 28 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఈ రోజుతో ప్రచారం ముగియనుండగా తదితర పార్టీ నాయకులంతా శరవేగంగా సమావేశాలు, ప్రెస్ మీట్ ల్లో పాల్గొంటున్నారు. తమ పార్టీ హామీలపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటీ తీవ్ర స్థాయిలో ఉండగా.. ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పై మరోసారి విరుచుకుపడ్డారు. ఈ మేరకు నిజమాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ కాంగ్రెస్ నేతల సమావేశాలు మాత్రమే జరిగాయని ఎద్దేవా చేశారు. భారాస ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం, పరిశ్రమలు, ఇళ్లకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. ఈ పదేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ‘భారాస ప్రభుత్వం వచ్చాక 2.30లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. వాటిలో ఇప్పటికే 1.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రైవేటు రంగంలో 30లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం. రాష్ట్రంలో కొత్తగా 10లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించాం. గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు కొత్త పాలసీ ప్రకటిస్తాం. రేషన్‌కార్డుల సమస్యలు పరిష్కరించి అందరికీ రూ.5లక్షల బీమా కల్పిస్తామన్నారు. ఇక బాండ్ పేపర్ల పేరిట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారన్న కవిత..137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఇంత స్థాయికి పడిపోయిందన్నారు. జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, దామోదర రాజనరసింహా, భట్టి విక్రమార్క వంటి పెద్ద నాయకులు కూడా బాండ్ పేపర్ రాసివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత విశ్వాసం కోల్పోయిందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నారు. Also read :మెదక్ లో తీవ్ర విషాదం.. నీట మునిగి ఐదుగురి మృతి అలాగే కర్నాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే డ్రామా చేసిందని, 223 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాశారన్నారు. కానీ అందులో వేటిని కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని కవిత పేర్కొన్నారు. కర్నాటకలో మహిళలకు రూ.2 వేల పెన్షన్, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ వంటి హామీలను ఇంకా మొదలుపెట్టలేదని కవిత విమర్శించారు. #mlc-kavitha #congress-patry #intresting-comments మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి