BIG Breaking: ఎమ్మెల్సీ కవితకు షాక్.. బెయిల్ పిటిషన్ మళ్లీ వాయిదా..

కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. తదుపరి విచారణను మళ్లీ సోమవారానికి వాయిదా వేసింది.

New Update
BIG Breaking: ఎమ్మెల్సీ కవితకు షాక్.. బెయిల్ పిటిషన్ మళ్లీ వాయిదా..

ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టులో మళ్లీ షాక్ తగిలింది. శుక్రవారం బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. తదుపరి విచారణను మళ్లీ సోమవారానికి వాయిదా వేసింది. కవితను ఈడీ అరెస్ట్ చేసిన విధానం.. లిక్కర్ కేసులో ఆమె పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలను కవిత తరఫున లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి ఆదివారం సాయంత్రం లోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా అందించాలని హైకోర్టు.. ఈడీ, సీబీఐ దర్యా్ప్తు సంస్థలను ఆదేశించింది. సోమవారం రెండు కేసుల్లో కవిత తరఫున వాదనలు పూర్తి చేయాలని ధర్మాసనం సూచించింది.

Also Read: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కేసు నమోదు

ఇక మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు వింటామని పేర్కొంది. ఆ తర్వాత కవిత బెయిల్ పటిషన్లపై విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు సీబీఐ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై.. శనివారం సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తామని సీబీఐ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు.  ఇదిలాఉండగా.. ఇటీవలే కవిత రౌస్‌ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసింది. కానీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్‌కు నిరాకరించింది. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 9న ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) ఆమె బెయిల్‌ పిటిషన్‌ వేశారు. ఈ నెల 10న ఈడీ కేసులో 16న సీబీఐ కేసుల్లో కవిత పిటిషన్లపై జస్టిస్‌ స్వర్ణకాంతశర్మ బెంచ్‌ విచారణ జరిపింది.

PMLA సెక్షన్‌ 19 ప్రకారం కవిత అరెస్ట్‌ అక్రమమని.. రూ.100 కోట్లు చెల్లించినట్టు ఆధారాలు కూడా లేవని కవిత తరపు లాయర్‌ వాదనలు వినిపించారు. దీంతో ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఈడీ, సీబీఐకి (CBI) కోర్టు నోటీసులు పంపింది. తదుపరి విచారణను మే 24కి వాయిదా వేసింది కోర్టు. అయితే ఈరోజు కూడా మళ్లీ విచారణను వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె తీహార్‌ జైల్లో కస్టడిలో ఉన్నారు.

Also Read: మల్లారెడ్డికి మరో షాక్..

Advertisment
Advertisment
తాజా కథనాలు