MLC Kavitha: ఎలా అరెస్ట్ చేస్తారు?.. కోర్టుకు కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కవిత లాయర్ మోహిత్ రావు కోర్టును కోరారు.

New Update
MLC Kavitha: ఎలా అరెస్ట్ చేస్తారు?.. కోర్టుకు కవిత

MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam) అరెస్టై తీహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జైల్లో సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కవిత లాయర్ మోహిత్ రావు కోర్టును కోరారు. ఈరోజు రంజాన్ కారణంగా కోర్టుకు సెలువు ఉండడంతో డ్యూటీ మేజిస్ట్రేట్ వద్ద పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కోర్టు ఏమందంటే?..

కవితను సీబీఐ అరెస్ట్ చేయడంపై తమకు ఎలాంటి నోటీసులు అందలేదని.. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కవిత తరఫున లాయర్ మోహిత్ రావు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఇది అత్యవసరంగా విచారించాల్సిన పిటిషన్‌ కాదని స్పెషల్‌ కోర్టు స్పష్టం చేసింది. కవిత పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది. తాను ఈ లిక్కర్ స్కాం కేసుపై వాదనలు వినలేదని.. రెగ్యులర్‌గా లిక్కర్ కేసు విచారణ జరిపే కావేరి భవేజా కోర్టులోనే వాదనలు వినిపించాలని జడ్జి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు.

ALSO READ: బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. బీజేపీలో మాజీ ఎమ్మెల్యే?

జైల్లో మరోసారి కవిత అరెస్ట్..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చింది సీబీఐ (CBI). ఎక్సైజ్ పాలసీ కేసులో (Excise Policy Case) కవితను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం లిక్కర్ స్కాం కేసులో జ్యూడీషియల్ కస్టడిలో ఉన్నారు కవిత. ఇటీవల జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో (Rouse Avenue Court) పిటిషన్ ను సీబీఐ దాఖలు చేయగా.. దానికి సానుకూలంగా స్పందించిన కోర్టు.. కవితను విచారించేందుకు అనుమతించింది.

అయితే కవితను విచారించేందుకు 10 రోజుల కస్టడీని సీబీఐ కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదిన జైలులో ఎమ్మెల్సీ కవిత ను సీబీఐ ప్రశ్నించింది. మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పై ఈ నెల 16న కోర్టు విచారణ చేపట్టనుంది. గత నెల 15న లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈడీ కేసులో బెయిల్ వచ్చినా.. CBI కేసులో జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి..

Advertisment
Advertisment
తాజా కథనాలు