kavitha: కుమారుడి బర్త్‌డే సందర్భంగా పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌(Hyderabad)లోని జూబ్లిహిల్స్‌లో పెద్దమ్మ తల్లి(Pedhamma thalli) అమ్మవారిని ఎమ్మెల్సీ కవిత(kavitha) దర్శించుకున్నారు. కవితకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. తన చిన్న కుమారుడు ఆర్య దేవనపల్లి బర్త్‌ డే సందర్భంగా ఎమ్మెల్సీ కవిత దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

New Update
kavitha: కుమారుడి బర్త్‌డే సందర్భంగా పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

Kavitha: MLC Kavita who visited her grandmother's mother on the occasion of her son's birthday
అమ్మవారి సేవలో..
జూబ్లిహిల్స్‌లో పెద్దమ్మ తల్లి అమ్మవారిని ఆదివారం ఉదయం(జులై 23) ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కవితకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. తన చిన్న కుమారుడు ఆర్య దేవనపల్లి బర్త్‌ డే సందర్భంగా కవిత పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చారు. తన భర్త అనీల్‌, కుమారులు ఆదిత్య, ఆర్యతో కలిసి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. కవిత దంపతులకు ఆలయ చైర్మన్ పీ విష్ణువర్ధన్‌రెడ్డి, పూజారులు ఘన స్వాగతం పలికారు. తర్వాత కవిత కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యకు తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనాలు వేదపండితులు అందజేశారు. దేవాలయానికి వచ్చిన పలువురు భక్తులతో ఎమ్మెల్సీ కవిత ముచ్చటించారు.

ప్రత్యేక పూజలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొడుకు ఆర్య దేవనపల్లి జూలై 23న ఆర్య పుట్టిన రోజు వేడుకలను సంతోషంగా జరుపుకొన్నారు. ఆర్య పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆర్యకు బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కవితకు ఉన్న అభిమానులను ఆర్యకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆర్య పుట్టిన రోజు సందర్భంగా కవిత దంపతులు పలు కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తాతయ్య సీఎం కేసీఆర్, శోభల నుంచి ఆర్య ఆశీర్వాదాలను తీసుకున్నారు. తర్వాత మామ కేటీఆర్ వద్దకు వెళ్లి ఆర్య ఆశీస్సులు తీసుకున్నారు.

ఇలా ఫ్యామిలీతో గడుపుతూనే.. పొలిటికల్‌లో కవిత బిజీ

ఇక కవిత తన ఫ్యామిలీతో సంతోషంగా ఉంటూ రాజకీయంలో కూడా దూసుకుపోతున్నారు. శనివారం(జులై 22) తనపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌కు ఒక్క రోజు సమయం ఇస్తున్నానని, ఆ లోగా ఆరోపణలలో రుజువు చేయ‌క‌పోతే పులాంగు చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని కవిత సవాల్ విసిరిన విషయం తెలిపిందే. అర్థం ప‌ర్థం లేని ఆరోపణలు చేస్తే బాగుండదని అర‌వింద్‌ను మ్మెల్సీ క‌విత‌ హెచ్చరించారు. అంతేకాదు మణిపూర్ అల్లర్లపై, నిరుద్యోగంపై బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని క‌విత ప్ర‌శ్నించారు. రైతు బంధు పథకానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. ఎన్నికల్లో అన్ని విషయాలపై నిలదీస్తామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అర్వింద్ ఏం తెచ్చారని నిలదీశారు. అబద్ధాల మీద సమాజం నడవదని సూచించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడికి వెళ్లి తప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవడమే బీజేపీ ఎజెండా అని క‌విత‌ ఆరోపించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు