MLC Duvvada Srinivas: ఇసుక దోపిడీ దుమారం.. ఎమ్మెల్సీ దువ్వాడ అరెస్ట్!

AP: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఇసుక చోరి దుమారం రేపుతోంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమంగా ఇసుక దోపిడీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై దువ్వాడ స్పందిస్తూ.. అచ్చెన్నాయుడు అనుచరులే ఇసుకను కొల్లగొట్టారని అన్నారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

New Update
MLC Duvvada Srinivas: ఇసుక దోపిడీ దుమారం.. ఎమ్మెల్సీ దువ్వాడ అరెస్ట్!

MLC Duvvada Srinivas: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఇసుక చోరి దుమారం రేపుతోంది. ఇసుక డంపింగ్‌ యార్డులో భారీగా ఇసుక మాయమైంది. ఇసుక చోరిపై అధికార టీడీపీ (TDP), వైసీపీ (YCP) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇసుక చోరీ చేశారంటూ ఎమ్మెల్సీ దువ్వాడపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. RTV ప్రతినిధితో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టారు దువ్వాడ.

ఆయన మాట్లాడుతూ.. తాను ఇసుక చోరీ చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని అన్నారు. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలిస్తే అసలు దొంగలు బయటపడతారని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అచ్చెన్నాయుడు అనుచరులే ఇసుకను కొల్లగొట్టారని ఆరోపించారు. ఇసుక చోరీని అడ్డుకున్న ప్రగతి ఇన్‌ఫ్రా సిబ్బందిపై అచ్చెన్న అనుచరులు దాడి చేసినట్లు చెప్పారు. మైనింగ్ శాఖ అధికారులు దొంగలను కాపాడుతున్నారని అన్నారు.

మరోవైపు ఇసుక మాయంపై అధికారులు స్పందించారు. అధికారులు మాట్లాడుతూ.. ఇసుక పెద్ద మొత్తంలో చోరీకి గురైందని అన్నారు. ఇసుక మాఫియా భరతం పడతాం అని చెప్పారు. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ALSO READ: ఏపీ మంత్రి ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన కేటీఆర్

Advertisment
Advertisment
తాజా కథనాలు