AP: అసలు ఈ  హాస్పిటల్ ఎందుకు కట్టారో: ఎమ్మెల్యే విజయ్

అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని హాస్పిటల్ గత ప్రభుత్వ శిలాఫలకాలకు మాత్రమే ఉపయోగపడిందన్నారు ఎమ్మెల్యే విజయ్ కుమార్. కేవలం 30 శాతం పనులు పూర్తిచేసి హాస్పిటల్ ను ఇక్కడికి షిఫ్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన సౌకర్యాలతో హాస్పటల్ ను తీర్చిదిద్దుతామని అన్నారు.

New Update
AP: అసలు ఈ  హాస్పిటల్ ఎందుకు కట్టారో: ఎమ్మెల్యే విజయ్

Anakapalli: అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని సెంట్రల్ హాస్పిటల్ ను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం అసలు ఈ  హాస్పిటల్ ఎందుకు కట్టిందో తెలియడం లేదన్నారు. హాస్పిటల్ ను కేవలం 30 శాతం మాత్రమే పూర్తిచేసి ఇక్కడికి షిఫ్ట్ చేశారని తెలిపారు.

Also read: పక్షవాతం.. దశాబ్దం గడుస్తున్న పెన్షన్ కి నోచుకోని అభాగ్యుడు..!

రోడ్డు నిర్మాణం లేకుండా హాస్పిటల్ కట్టారని ఒక అంబులెన్స్ రావాలంటే ఎలా రావాలో కూడా తెలియకుండా హాస్పటల్ నిర్మించారని అన్నారు. హాస్పిటల్ ఎంట్రన్స్ మాత్రమే కట్టారని గత ప్రభుత్వం శిలాఫలకాలకు మాత్రమే ఈ హాస్పిటల్ ఉపయోగపడిందని ఎమ్మెల్యే అన్నారు.

Also Read: తిరువూరులో హై టెన్షన్.. ఆందోళకు దిగిన అధికార పార్టీ ఎమ్మెల్యే

ప్రజలకి సౌకర్యం కల్పించే విధంగా డాక్టర్స్ తో చర్చించి మెరుగైన సౌకర్యాలతో హాస్పటల్ తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పుడు పనులు మా ప్రభుత్వం చేయదని హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం అన్ని వసతులు కల్పించి ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా కృషి చేస్తామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు