MLA KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టిందని అన్నారు. నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్లు ఆపేసిందని.. వెంటనే ఆ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కేటీఆర్ సీఎం రేవంత్‌ను డిమాండ్ చేశారు. By V.J Reddy 04 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLA KTR: చేనేత కార్మికుల సంక్షేమం కోసం మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో.." బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు పండుగలా కళకళలాడిన చేనేతరంగం.. మీ కాంగ్రెస్ రాగానే మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మునిగిపోయిందో.. మళ్లీ కాంగ్రెస్ వచ్చి నాగులునెలలు గడవకముందే అదే విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి వల్ల గత నాలుగు నెలలుగా నేతన్నలు చేనేత పనులకు దూరం అవడంతోపాటు, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయి. చేనేత కార్మికులు, పవర్ లూమ్ ఆసాములతోపాటు కార్మికులు రోడ్డునపడటంతో.. పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ముందు చూపు లేకపోవడం వల్ల వేలాది మంది నేతన్నలు, పవర్ లూమ్ కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నా మీ ప్రభుత్వానికి కనీస కనికరం లేదు. తమకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మిక లోకం.. ప్రతినిత్యం దీక్షలు, ధర్నాలు, నిరసనలతో.. ఏదో ఒక రూపంలో తమ ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ మీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం అత్యంత దారుణమైన విషయం. ఆదుకోవాల్సిన అధికార పార్టీ నేతలే కార్మికులను అవమానించేలా మాట్లాడటం.. వారి మనోస్థయిర్యాన్ని మరింత దెబ్బతీస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ప్రతి కార్మికుని గుండెను గాయపరిచింది. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తడుక శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఉరి వేసుకుని తనువు చాలించాడు. ఇది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగానే నేతన్నలు భావిస్తున్నారు. నేతన్నలపైనా కాంగ్రెస్ కున్న చిన్న చూపు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన మీకు ఒక్క సారి గతం గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. సరిగ్గా ఇవే పరిస్థితులు సమైక్యరాష్ట్రంలో నెలకొని ఉండేవి. తెలంగాణ సాధించాక పాలనా పగ్గాలు చేపట్టిన కేసిఆర్ గారు తెలంగాణలో నేతన్నలను, వస్త్ర పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. చిక్కిశల్యమైన ఈ పరిశ్రమను ఆదుకోవడానికి స్వయంగా వస్త్ర పరిశ్రమ పెద్దలను పిలిపించి ఒక రోజంతా అధికారులతో కలిసి అప్పటి సీఎం కేసిఆర్ గారు సమీక్ష నిర్వహించారు. నేతన్నల వేతనాలను, కూలీలను రెట్టింపు అయ్యేలా, ప్రతి కార్మికుడు నెలకు 15 నుంచి 20 వేలు సంపాదించుకుని గౌరవప్రదంగా జీవించేందుకు పటిష్టమైన కార్యాచరణను రూపొందించారు. అనేక వినూత్నమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారు. చేనేత మిత్రా, నేతన్నకు చేయూత వంటి కార్యక్రమాలు ప్రారంభించాము. వీటి కోసం భారీ ఎత్తున గత 60 ఏండ్లలో ఎప్పుడు లేనంత బడ్జెట్ కేటాయించాము." అంటూ లేఖలో పేర్కొన్నారు. నేతన్నలపై కక్ష కట్టిన కాంగ్రెస్ సర్కారు - @KTRBRS - నేతన్నలపై కాంగ్రెస్ కు ఎందుకింత కక్ష? - ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..! - కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా..!! - పదేళ్ల తరువాత సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభం..! - నేతన్నల బతుకులు ఆగం అయ్యేలా కాంగ్రెస్ విధానాలు -… pic.twitter.com/cICcK0yt2B — BRS Party (@BRSparty) April 4, 2024 #ktr #cm-revanth-reddy #lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి