AP DSC: డీఎస్సీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే!

నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు అనంతపురం రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. డీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకోసం ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. నిష్ణాతులైన అధ్యాపకులచే పాఠాలు చెప్పిస్తామన్నారు. ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించారు.

New Update
AP DSC: డీఎస్సీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే!

Ananthapuram: ఏపీ టీచర్ అభ్యర్థులకు అనంతరపురం రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు భారీ శుభవార్త చెప్పారు. నిరుద్యోగులను ఉద్యోగాల్లో చూడాలనే లక్ష్యంతో ఉచిత కోచింగ్ సెంటర్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ మేరకు రాయదుర్గం పట్టణంలోని టెక్స్ టైట్ పార్క్ వద్ద ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్ ను శ్రీనివాస్ ప్రారంభించగా.. ఆర్డిఓ రాణి సుష్మిత, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నిష్ణాతులైన అధ్యాపకులచే క్లాసులు..
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు.. ఎన్నికల హామీ ఇచ్చిన ప్రకారంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీఎస్సీపై తొలి సంతకం చేశారు. మెగా డీఎస్సీ ప్రకటన చేయడం ఎంతో గొప్ప విషయం. రాయదుర్గం నియోజకవర్గంలో చాలామంది నిరుపేదలైన నిరుద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. వారికి ఆర్థిక భారం తగ్గించడం కోసమే ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్ ను నిష్ణాతులైన అధ్యాపకులచే ప్రారంభించాం. కోచింగ్ సెంటర్ కు వచ్చిన ప్రతి నిరుద్యోగ విద్యార్థి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నిరుద్యోగ ఉపాధ్యాయుడు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉచిత కోచింగ్ తో పాటు మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీనివాసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు