Harish Rao: పెన్షన్ దారులను కాంగ్రెస్ మోసం చేసింది: హరీష్ రావు

TG: పెన్షన్ దారులను కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్నికల సమయంలో రూ.2వేలుగా ఉన్న పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని చెప్పి మాట తప్పిందని ఫైర్ అయ్యారు. దీనిపై పెన్షన్ దారులకు ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

New Update
Harish Rao: పెన్షన్ దారులను కాంగ్రెస్ మోసం చేసింది: హరీష్ రావు

Harish Rao: బడ్జెట్‌ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని అన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు. రూ. 4.5 లక్షలు లేని జీఎస్‌డీపీని రూ.14 లక్షలకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. 1400 మెగావాట్లు రామగుండం నుంచి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగా లేదని మాటలు చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రూ.200 పింఛన్‌ను రూ. 2 వేలకు పెంచమని అన్నారు. ఎన్నికల సమాయంలో తాము అధికారంలోకి రాగానే రూ.2 వేల పెన్షన్ ను కాస్త రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అమలు చేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో అసలు రూ.2వేల పెన్షన్ కూడా ప్రభుత్వం అందించడం లేదని ఆరోపించారు. అమలు కానీ హామీలు ఇచ్చామా.. అధికారంలోకి వచ్చామా అన్నట్టు కాంగ్రెస్ పాలన ఉందని విమర్శించారు.



Advertisment
Advertisment
తాజా కథనాలు