Crime: ఆఫీసులోనే మరో మహిళతో కాపురం.. భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య ఏం చేసిందంటే..?

విశాఖలో మరో మహిళతో ఉన్న భర్తను భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. భార్యను విడిచిపెట్టి మరో మహిళతో కాపురం పెట్టాడు భర్త వెంకటసాయి తేజ. బాధితురాలు నక్షత్ర మిస్ వైజాగ్‌, తెలుగు అమ్మాయి అవార్డు విన్నర్‌. తనకు రోజుకో మహిళ కావాలని నక్షత్రపై దాడి చేసేవాడని తెలుస్తుంది.

New Update
Crime: ఆఫీసులోనే మరో మహిళతో కాపురం.. భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య ఏం చేసిందంటే..?

Nakshatra Husband Incident: మరో మహిళతో ఉన్న భర్తను భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. బాధితురాలు నక్షత్ర మిస్ వైజాగ్‌, తెలుగు అమ్మాయి అవార్డు విన్నర్‌. వెంకటసాయి తేజ అనే వ్యక్తిని కొన్నేళ్ల క్రితం నక్షత్ర ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే, విభేదాల కారణాంగా భార్యభర్తలు వేరువేరుగా ఉంటున్నారు. ఇటీవల మరో మహిళను పెళ్లి చేసుకుని వెంకటసాయి తేజ వేరు కాపురం పెట్టాడు. ఆఫీసులోనే మరో మహిళతో కాపురం పెట్టాడు.

Also read: ప్రియుడి టార్చర్‌.. రోడ్డుపైనే పలుసార్లు ఇలా వేధించేవాడు..!

విషయం తెలుసుకున్న భార్య నక్షత్ర భర్త వేరే ఆమెతో ఉంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చెంప చెల్లుమనిపించింది. ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో వెంకటసాయి తేజను అతడితో ఉన్న యువతిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయి తేజ నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు నక్షత్ర ఓ ఆడియో బయటపెట్టింది. ఆ ఆడియోలో తాను మంచి వాడిని కాబట్టే తన దగ్గరికి వేరే స్త్రీలు వస్తున్నారన్నాడు. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు