బీఆర్ఎస్, బీజేపీ టీం అనడంతో రాహుల్‌పై బీఆర్‌ఎస్ నేతల ఫైర్‌

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖమ్మంలో రాహుల్ అవగాహన లేకుండా మాట్లాడారని..ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ జరుగుతుందో తెలుసుకోకుండా రాహుల్ మాట్లాడారని అన్నారు. ఏ హోదాలో రాహుల్ పెన్షన్ల గురించి హామీ ఇచ్చారని. . కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 4 వేల పెన్షన్ అమలవుతుందా? అని ప్రశ్నించారు.

New Update
బీఆర్ఎస్, బీజేపీ టీం అనడంతో రాహుల్‌పై బీఆర్‌ఎస్ నేతల ఫైర్‌

తెలంగాణలో 4 వేల పెన్షన్ ఇస్తామంటున్న రాహుల్ ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ హయంలో జరిగినన్ని స్కాంలు ఎక్కడా జరగలేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారని అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ టీం అనడంపై గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఏ పార్టీకి బీం టీం కాదని కేసీఆర్ చెప్పారని మంత్రి వేముల అన్నారు. బీజేపీ నేత ఈటల, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రహస్య భేటీ నిజం కాదా? అని ప్రశ్నించారు.హోటల్ లో రహస్య భేటీ ఫోటోలు చూపించమంటారా అని ప్రశ్నించారు. వాస్తవాలు తెలిసిస్తే ఎవరు ఏవరికి బీ టీమో అర్థమవుతుందన్నారు.

రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం పోటీ ఎందుకు ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. అక్కడ బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదా అని నిలదీశారు. ఆ పార్టీ నేతల ఇండ్లపై ఐటీ, ఈడీ రైడ్లు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో భూమి నుంచి ఆకాశం వరకు అన్నింట్లో కుంభకోణమేనని ఆరోపించారు. ఖమ్మం సభ సందర్భంగా ఆ పార్టీలో చేరిన నేతల్లో ఎవరికీ బీఆర్‌ఎస్‌ అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు.

తెల్లం వెంకట్రావ్, పిడమర్తి రవి, కోరం కనకయ్య టికెట్ ఇచ్చినా గెలవలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఎందుకివ్వలేకపోయారని పువ్వాడ ప్రశ్నించారు. రైతుబంధు, రైతు బీమా ఎందుకివ్వలేదన్నారు.కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశం ఆదర్శంగా తీసుకుంటుందన్నారు. అవినీతి డిక్షనరీ కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ తరహా పథకాలు ఎందుకులేవని పువ్వాడ ప్రశ్నించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు