Uttam Kumar Reddy: ఆ లెక్కలు తేల్చండి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ సంచలన ఆదేశాలు మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగడం, ప్రాజెక్టు వ్యయం, ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు తదితర వివరాలను అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితితో పాటు పలు అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. By Naren Kumar 11 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Medigadda: మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగడం, ప్రాజెక్టు వ్యయం, ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు తదితర వివరాలను అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జలసౌధలో సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితితో పాటు పలు అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నిర్వహించిన తొలి సమీక్ష ఇదే. సమీక్షలో భాగంగా ఈఎన్సీ మురళీధర్ రావు ప్రాజెక్టుల గురించి మంత్రికి వివరించారు. ఇది కూడా చదవండి: రైతుబంధుపై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ఉద్యోగులతో పాటు వారికి కట్? త్వరలో మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన: మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు ఏర్పాట్లు చేయాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్న మంత్రి తన సందర్శన సమయంలో ప్రాజెక్టును నిర్మించిన ఏజెన్సీ, అధికారులను అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఒక్కో ఎకరా సాగుకు ఎంత ఖర్చవుతుంది? ఎంత ఆయకట్టుకు సాగునీరందించేందుకు ప్రాజెక్టును నిర్మించారు.. నిర్మాణానికి అయిన వ్యయం.. ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు.. తదితర అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.4,600 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. ఇది కూడా చదవండి: ఆర్కే రాజీనామా అందుకేనా? షర్మిలతో కలిసి నడుస్తారా? అందులో ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగి, మరో మూడు పిల్లర్లపై దాని ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. అయితే, పిల్లర్లు కుంగిన వెంటనే ప్రాజెక్టులో నీటిని తీసేశామని, నష్ట నివారణ చర్యలు చేపట్టడంతో కుంగుబాటు తగ్గిందని అధికారులు మంత్రితో చెప్పారు. #uttam-kumar-reddy #review-on-irrigation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి