TS: పెద్దవాగు ఎఫెక్ట్.. ప్రభుత్వం హైఅలర్ట్..!

ఖమ్మం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టు ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ అయింది. అన్ని భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల సామర్థ్యం, క్రస్ట్ గేట్ల పనితీరుపై నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దిగువ ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు.

New Update
TS: పెద్దవాగు ఎఫెక్ట్.. ప్రభుత్వం హైఅలర్ట్..!

Peddavagu Project : ఖమ్మం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టు ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ అయింది. అన్ని భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల సామర్థ్యం, క్రస్ట్ గేట్ల పనితీరుపై నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల నుంచి వరదను వదిలే క్రమంలో దిగువ ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయాలని స్టాండింగ్ ఆపరేషన్ ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. వరదలపై గంటకోసారి సమీక్ష చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చీఫ్ ఇంజనీర్లు జిల్లా కేంద్రం దాటి వెళ్లకూడదని ఎస్ ఈ, ఈఈ, డీఈఈ, ఏఈఈ, ఏఈలు క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. ప్రాజెక్టులు, కాలువల గేట్లన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదో నిశితంగా పరిశీలించాలన్నారు. గత గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ నిర్వహణ లోపానికి తోడు సమయానికి క్రస్ట్ గేట్ తెరుచుకోలేదు. దీంతో ప్రాజెక్టుకు గండి పడగా 30 మంది కూలీలు వదల్లో చిక్కుకుపోయారు. అయితే, వారిని ఎన్డీఆర్ఎఫ్ సురక్షితంగా కాపాడింది.

కాగా, వేల ఎకరాల్లో పంట నష్టం, భారీగా ఆస్తి నష్టం జరిగింది. వరదలో పశువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు కొట్టుకుపోయాయి. సుమారు 1500 కోట్లమేర నష్టం వాటిల్లినట్లు నిపుణుల అంచనా వేసి నలుగురు అధికారులకు మెమోలు జారీ చేశారు. ప్రాజెక్టు మరమ్మతులకు 300 కోట్లు పట్టొచ్చని అంచనా వేశారు. అయితే, ఈ విషయంపై పూర్తిగా నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.

Also Read: ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. స్కూళ్లకు సెలవులు!


Advertisment
Advertisment
తాజా కథనాలు