Telangana Farmers: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

TG: రాష్ట్ర రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.ఇకనుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని.. పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

New Update
Telangana Farmers: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

Minister Thummala Nageswara Rao: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రేవంత్ సర్కార్ అండగా నిలిచేందుకు సిద్ధమైంది. ఈరోజు కిసాన్‌ మోర్చా సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు తీపి కబురు అందించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడవద్దని అన్నారు. మాది రైతు ప్రభుత్వం.. రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం అని అన్నారు. ఇకనుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. రాబోయే బడ్జెట్‌ సమావేశం తర్వాత రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తాం అని అన్నారు. ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ చేస్తాం అని హామీ ఇచ్చారు.

ALSO READ: భారత్‌లో భూకంపం

లోక్ సభ ఎన్నికల తరువాతే..

లోక్ సభ ఎన్నికల తరువాత రైతు బంధు పడని వారందరికి ఆ డబ్బును జమ చేస్తామని అన్నారు తుమ్మల. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్లే రైతులకు రైతు బంధు వేసే విషయంలో ఆలస్యం అయిందని పేర్కొన్నారు. దాదాపు 90 శాతం మంది రైతు బంధు లబ్ధిదారులకు రైతు బంధు డబ్బులు జమ అయినట్లు చెప్పారు. కాగా మిగిలిన 10 శాతం మందికి లోక్ సభ ఎన్నికలకు అయిపోగానే అంటే మే 14 తేదీ రైతు బంధు డబ్బు జమ అవుతాయని అన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని కోరారు

రైతు బంధుకు ఈసీ బ్రేక్..

తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. రైతు భరోసా (రైతు బంధు) స్కీమ్ కు సంబంధించిన నిధుల విడుదలను ఆపాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) అమల్లో ఉన్న నేపథ్యంలో మిగిలిన లబ్ధిదారులకు మే 13 తర్వాత పంపిణీ చేయాలని ఆదేశించింది ఈసీ.  ఈ నెల 9వ తేదీలోగా రైతులందరి ఖాతాల్లో రైతుభరోసా నిధులను జమ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. దీనిపై ఎన్‌.వేణు కుమార్‌ ఈసీకి కంప్లైంట్ చేశారు. స్పందించిన ఈసీ.. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని సీరియస్ అయ్యింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు