Apple iphone hacking:నిజాలు తెలుసుకుని వార్తలు రాయాలి-వాషింగ్టన్ పోస్ట్ మీద మండిపడ్డ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజకీయ నేతల ఆపిల్ ఫోన్ల హ్యాక్ విషయం మీద వాషింగ్టన్ పోస్ట్ రాసిన కథనం మీద మండిపడ్డారు యూనియన్ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్. సగం సగం నిజాలు తెలుసుకుని వార్తలను రాయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ట్వీట్ చేశారు. By Manogna alamuru 29 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ప్రతిపక్ష నేతల ఆపిల్ ఐఫోన్ల హ్యాకింగ్ వివాదం దేశంలో చర్చనీయాశంగా మారింది. ఈ నేపథ్యంలో ఐఫోన్లకు అలర్ట్ నోటిఫికేషన్లు రావడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(ఐటీ) ఆపిల్ ఇండియా అధికారులకు సమన్లు జారీ చేసింది. అయితే ఈ అంశంపై ఆపిల్ సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది. తాము బెదిరింపు నోటిఫికేషన్‌ను పంపలేదని, ఇవి నకిలీవి అయి ఉండొచ్చని ఆపిల్ కూడా చెప్పింది. అయితే ఇదంతా అక్టోబర్ లో జరిగింది. తాజాగా దీని మీద వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. బీజేపీని అనుమానిస్తూ అందులో రాశారు. బీజెపీ గవర్నమెంట్ కావాలనే ఆపిల్‌తో కలిసి ఫోన్లు హ్యాక్ చేయిస్తోంది అన్న అర్ధం వచ్చేట్టు వ్యాసం రాసింది. దీని మీద మండిపడ్డారు యూనియన్ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్. Rebutting @washingtonpost 's terrible story telling is tiresome, but someone has to do it. ➡️This story is half facts, fully embellished 😅 ➡️Left out of the story is Apples response on Oct 31- day of threat notifications “Apple does not attribute the threat notifications to… https://t.co/6XhRC8QVBu — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) December 28, 2023 ప్రతిపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్ అలెర్ట్ నోటిఫికేషన్ మీద తాము వెంటనే చర్యలు తీసుకున్నామని...ఆపిల్ సంస్థతో కూడా మాట్లాడి చర్యలు తీసుకున్నామని అన్నారు. వారు అది ఫాల్స్ అలారం అని చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్, పవన్ ఖేరాతో సహా ప్రతిపక్ష నాయకులు తమ ఐఫోన్‌లు హ్యాక్ అయినట్లు అలర్ట్ మెసేజ్‌లు రావడంతో వివాదం తలెత్తింది. హ్యాకింగ్ అలర్ట్ వచ్చిన వారి జాబితాలో తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ(ఎం), సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీల నేతలు కూడా ఉన్నారు. అయితే ఈ అంశంపై ఆపిల్ సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది. తాము బెదిరింపు నోటిఫికేషన్‌ను పంపలేదని, ఇవి నకిలీవి అయి ఉండొచ్చని ఆపిల్ పేర్కొంది. ఈ అలర్ట్ మెసేజ్‌లు రాజకీయ ప్రముఖులకే పరిమితం కాకుండా జర్నలిస్టులు, మేథావులకు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. #hacking #union-minister #apple-phone #notifovation #us-daily మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి