AP: నీకు ఆ అర్హతే లేదు.. సభలో అలా చేసిన వ్యక్తి జగన్ ఒక్కరే.. మంత్రి సంధ్యారాణి సెన్సేషనల్ కామెంట్స్ ప్రతిపక్షహోదా గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదంటూ మంత్రి సంధ్యారాణి కౌంటర్ ఇచ్చారు.11 సీట్లు వచ్చిన జగన్ ప్రతిపక్షహోదా ఎలా అడుగుతారని ప్రశ్నించారు. స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా జగన్ లేరని..సభ మీద గౌరవం లేని వ్యక్తి ప్రతిపక్ష హోదా గురించి ఎలా మాట్లాడతారని నిలదీశారు. By Jyoshna Sappogula 25 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి Sandhya Rani : ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి మాజీ సీఎం జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను.. బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే..వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందా? అని లేఖలో ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. Also Read: వారికి అవకాశం కల్పిస్తూ త్వరలో టెట్ నిర్వహించబోతున్నాం: మంత్రి లోకేష్ అయితే, ఈ విషయంపై జగన్‌కు మంత్రి సంధ్యారాణి కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు జగన్ అంటూ కామెంట్స్ చేశారు. 11 సీట్లు వచ్చిన జగన్ ప్రతిపక్షహోదా ఎలా అడుగుతారు..? అసలు సభ అంటే జగన్ కు గౌరవం ఉందా..? తన పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా సభలో కూర్చొని వ్యక్తి జగన్ ఒక్కరేనేమో..? అని ప్రశ్నలు సంధించారు. Also Read: వైసీపీకి మరో బిగ్ షాక్.. జిల్లా కార్యాలయానికి నోటీసులు..! ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో కొందరు ఇతర పదాలు తప్పుగా మాట్లాడతారని.. కానీ జగన్ ప్రమాణ స్వీకారం రోజున ఆయన పేరే మర్చిపోయారని అన్నారు. స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా జగన్ లేరుని.. సభ మీద గౌరవం లేని వ్యక్తి ప్రతిపక్ష హోదా గురించి ఎలా మాట్లాడతారు..? అని ప్రశ్నించారు. మహిళలను గత ప్రభుత్వం ఎంతలా ఏడిపించింది? వైసీపీ నేతలు మాట్లాడే అర్హత కోల్పోయారని మంత్రి సంధ్యారాణి ఉద్ఘాటించారు. #jagan #sandhya-rani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి