Minister Roja: బ్రాహ్మణీకి అసలు సైకోలు ఎవరో తెలియడం లేదు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై టూరిజం శాఖ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే బాబు మాత్రం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలంటూ స్కిల్ డెవలప్‌ మెంట్‌ స్కీమ్‌ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు.

New Update
Roja: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి రోజా..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై టూరిజం శాఖ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే బాబు మాత్రం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలంటూ స్కిల్ డెవలప్‌ మెంట్‌ స్కీమ్‌ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. పలు కంపెనీల ద్వారా చంద్రబాబు సుమారు 371 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకున్నాడని విమర్శించారు.

చంద్రబాబు ఆ స్కామ్‌లో అన్ని ఆధారాలతో దొంగలా దొరికి జైల్లో కూర్చుంటే ఆయన కోడలు బ్రాహ్మణి చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలంతా గంటకొట్టి బాబుకు సంఘీభావం తెలపాలని కోరడం ఏంటన్నారు. బహుశా బ్రాహ్మణికి అసలు సైకో ఎవరో తెలియక ట్విట్‌లు పెడుతున్నట్లు ఉన్నారని రోజా ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో అసలు సైకోలు చంద్రబాబు నాయుడు, ఆయన బావమరిది బాలకృష్ణ అని మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ అసెంబ్లీని సినిమా సెట్ అనుకుంటున్నాడని రోజా ఎద్దేవా చేశారు. అందుకే ఆయన తొడలు కొట్టడం, విజుల్స్‌ వేయడం లాంటి వికృత చేష్టలు చేశారని విమర్శించారు.

మరోవైపు నారా లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన రోజా.. లోకేష్‌ చేపట్టిన యువగళం యాత్రకు ప్రజా స్పందన కరువైందన్నారు. లోకేష్‌ టీడీపీ నేతలతో తన యాత్రను కొనసాగిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో నారా లోకేష్‌ సైతం జైల్లో కూర్చోక తప్పదని మంత్రి రోజా మండిపడ్డారు. తండ్రి చేసిన తప్పుల్లో తనయుడి పాత్ర కూడా ఉందని రోజా అన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఒకే జైల్లో కూర్చొని చిప్పకూడు తినడం ఖాయమని టూరిజం శాఖ మంత్రి జోస్యం చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Food poisoning : అంగన్‌వాడీ కేంద్రంలో పులిహోర తిన్న చిన్నారులు అస్పత్రిపాలు...

ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌, అంగన్‌వాడీలలో నాణ్యతలేని ఆహార పదార్థాలు వాడడం వల్ల విద్యార్థులు తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా ఓ అంగన్ వాడీ కేంద్రంలో పులిహోర తిన్న చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన తిరుపతి జిల్లాలో కలకలం రేపింది.

New Update
Food poisoning at Anganwadi center

Food poisoning at Anganwadi center

Food poisoning :  ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌, అంగన్‌వాడీలలో  నాణ్యతలేని ఆహార పదార్థాలు వాడడం వల్ల విద్యార్థులు తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు. ఓ అంగన్ వాడీ కేంద్రంలో పులిహోర తిన్న చిన్నారులు తీవ్ర అస్వస్థకు గురైన సంఘటన తిరుపతి జిల్లాలో కలకలం సృష్టించింది. ఆడుకుంటూ వెళ్లిన విద్యార్థులు అచేతన స్థితిలోకి వెళ్లడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు పిల్లలను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

 
పెళ్లకూరు మండలం, కానూరు దళిత వాడలోని కానూరు అంగన్వాడీ కేంద్రానికి మంగళవారం ఉదయం 18 మంది పిల్లలు హాజరయ్యారు. మెనూ ప్రకారం పులిహోర అన్నం వడ్డించారు. దాన్ని తిన్న తర్వాత చిన్నారులు ఇళ్లకు వెళ్లారు. వీరిలో ఐదుగురు చిన్నారులు తీవ్రంగా వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురయ్యారు. గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ నాగరాజు హూటాహుటిన గ్రామానికి చేరుకొని చిన్నారులను నాయుడుపేట సామాజిక వైద్యశాలకు తరలించారు. అస్వస్థత గురైన విద్యార్థులలో గురవయ్య(4) గురువర్షిని (3) నాని(5) జోత్స్న(4) జస్వంత్ (3) ఉన్నారు. వీళ్లకు వైద్యులు చికిత్న అందిస్తున్నారు.


 Also read: BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’

చిన్నారులు అస్వస్థతకు గురి కావడానికి అంగన్వాడీ కేంద్రంలో వడ్డించిన పులిహోరే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సూపర్ వైజర్ శ్రీదేవి ఆసుపత్రి వద్దకు చేరుకుని వివరాలను సేకరించారు. అంగన్ వాడీ కేంద్రంలోనూ తనిఖీలు చేశారు. అంగన్ వాడీ కేంద్రంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, నిన్న వండిన వంటకాలను ఇవాళ వడ్డిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాసిరకమైన ఆహారం వడ్డిస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Also read: Pavan kalyan son : అప్పుడు తెలియలేదు.. విషయం ఇంత సీరియస్ అని : పవన్ కళ్యాణ్

 

Advertisment
Advertisment
Advertisment