Telangana Elections: ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ములేకే భౌతిక దాడులు చేస్తున్నారు: కేటీఆర్ అచ్చంపేటలో జరిగిన ఘర్షణలో గాయాలపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును మంత్రి కేటీఆర్ పరామర్శించారు. విపక్ష పార్టీలు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో.. ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని వ్యాఖ్యానించారు. By B Aravind 12 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి నాగర్‌కర్నూల్ జిల్లాలో అర్ధరాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెరలేరిగిన సంగతి తెలిందే. ఈ ఘర్షణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే బాలరాజుకు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే మంత్రి కేటీఆర్ ఆయన్ని పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చారు. ఈ నేపథ్యంలో తమ నాయకులపై జరిగిన దాడులపై స్పందించారు. ఇటీవలె ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడులు చేశారని.. ఇప్పుడు ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి జరగడం దురదృష్టకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని వ్యాఖ్యానించారు. విపక్ష పార్టీలు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. Also Read: బీఆర్ఎస్ పార్టీలో చేరిన పాల్వాయి స్రవంతి.. ఇదిలా ఉండగా.. అచ్చంపేట నియోజకవర్గంలో వెళ్తున్న ఓ కారులో 2 బ్యాగ్‌లుకు ఉండటాన్ని గుర్తించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వాహనాన్ని వెంబడించారు. అయితే అది ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆగింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రాత్రి 10 తర్వాత డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపించారు. ఆ కారు అద్దాలు పగలగొడ్డారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొట్టారు. Also Read: నువ్వెంత నీ బతుకెంత..25వేల మెజార్టీతో గెలవబోతున్నా…శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు..!! #ktr #telangana-election-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి