Telangana: కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర.. కాంగ్రెస్ డిక్లరేషన్‌పై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్ విడుదల చేసిన మైనార్టీ డిక్లరేషన్‌పై మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి సంయుక్తంగా ఈ డిక్లరేషన్‌ను ప్రిపేర్ చేసినట్లుగా ఉందని విమర్శించారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నమే ఈ డిక్లరేషన్ అని విమర్శించారు కేటీఆర్. By Shiva.K 10 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Minister KTR: కాంగ్రెస్ ప్రకటించిన మైనారిటీ డిక్లరేషన్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఈ డిక్లరేషన్‌ను కాంగ్రెస్, బీజేపీ సంయుక్తంగా తయారు చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మాట్టాడారు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ అంతా బూటకం అని విమర్శించారు. బీజేపీ ఐడియాలజీతో కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్(Congress Minority Declaration) ఇచ్చినట్లుగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తప్పుడు వాగ్ధానాలు చేయడం కొత్తేమీ కాదని, గతంలోనూ చాలా సార్లు ఇలాంటి తప్పుడు వాగ్ధానాలు ఇచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ డిక్లరేషన్‌లో ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తిస్తామని పేర్కొన్నారని, అలా చేస్తే మైనారిటీల ప్రత్యేక హోదా పోతుందన్నారు కేటీఆర్. మైనారిటీ డిక్లరేషన్ పేరుతో బీసీలకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నమే ఈ డిక్లరేషన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. From 2004 to 2014 in United Andhra Pradesh Congress Government spent only Rs.930cr for Muslims whereas the Government of Telangana from 2014 till date has spent RS.10,140 crore on Telangana Minorities Welfare ! - @KTRBRS pic.twitter.com/B972KOoUvo — Krishank (@Krishank_BRS) November 10, 2023 2004 నుంచి 2014 వరకు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మైనారిటీల కోసం ఏం చేసిందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ప్రత్యేక సబ్ ప్లాన్ తీసుకొస్తామంటున్న కాంగ్రెస్.. వారు అధికారంలో ఉన్న సమయంలో కేవలం రూ. 930 కోట్లు ఇచ్చిందన్నారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన పదేళ్ల కాలంలో మైనారిటీలకు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు మంత్రి కేటీఆర్. بی آر ایس حکومت میں عوامی صحت کے نظام کو بہتر بنایا گیا سرکاری اسپتالوں میں کارپوریٹ طرز کی خدمات مفت میں دی جا رہی ہیں کئی اور اسکیموں پر عمل ہو رہا ہے جس سے سماج کے ہر طبقہ کا بھلا ہو رہا ہے pic.twitter.com/rFaZy3u7Ts — BRS Party (@BRSparty) November 10, 2023 آئین نے مسلمانوں، عیسائیوں اور سکھوں کو اقلیت کا درجہ دیا ہے۔ لیکن کانگریس پارٹی آر ایس ایس کے نظریے کے زیر اثر اقلیتوں کی اس حیثیت کو چھیننا چاہتی ہے۔ ایک بار اقلیتوں کو بی سی کے طور پر شمار کیا گیا، وزارت اقلیتی بہبود، اقلیتی کمیشن اور دیگر اداروں کو ختم کر دیا جائے گا۔ وہ 4… pic.twitter.com/51NA4LXXOH — BRS Party (@BRSparty) November 10, 2023 Also Read: లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్.. మరో అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్.. ఎవరంటే.. సీఎం జగన్ కారును ఢీకొన్న మరో కారు.. తృటిలో తప్పిన ప్రమాదం.. #congress #telangana-elections-2023 #minister-ktr #telangana-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి