Kodali Nani: ఇలాంటి కూతురు ఎవరికీ ఉండదు.. పురంధేశ్వరిపై కొడాలి నాని సంచలన కామెంట్స్..

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. కన్న తండ్రికి వెన్నుపోటు పొడిచి.. ఆయన మానసిక వేదనతో చనిపోయేలా చేసిన పురంధేశ్వరి లాంటి కూతురు ఎవరికీ ఉండదన్నారు.

New Update
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

Kodali Nani Comments on Purandeswari: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి బీ టీమ్‌గా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నాడు ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తులలో పురంధేశ్వరి కూడా ఒకరని విమర్శించారు. కన్నతండ్రికి నమ్మకం ద్రోహం చేసి.. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి ముఖ్యపాత్ర పోషించిన వ్యక్తి పురంధేశ్వరి అని విమర్శించారు. కన్న తండ్రిని వెన్నుపోటు పోడిచి.. ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించి.. ఆయన మానసిక వేదనతో మరణించేలా చేసిన కూతురు ప్రపంచంలో ఏ తండ్రికి ఉండరని ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకపడ్డారు కొడాలి నాని.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇసుక దోపిడీతో పాటు అనేక దోపిడిల్లో పురంధేశ్వరీకి కూడా వాటాలు వెళ్ళేవని ఆరోపించారు కొడాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 4,000 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇసుక మీద ఒక్కరూపాయి కూడా రాలేదని, వారంతా కలిసి అ డబ్బులు దోచుకున్నారని ఆరోపించారాయన. నాడు దోచుకుని.. ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక దోపిడి జరుగుతోందని మాట్లాడటం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు పురంధేశ్వరి. ఆమె చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. తండ్రికి వెన్నుపోటి పొడిచి.. ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్‌లో చేరి లంచాలు తీసుకున్నారని పురంధేవ్వరిపై తీవ్ర ఆరోపణలు చేశారు కొడాలి నాని. అనేక పార్టీలలో మారి.. ఆ పార్టీలను భూస్థాపితం చేసిన వ్యక్తి పురంధేశ్వరి అని వ్యాఖ్యానించారు. పురంధేశ్వరికి రాష్ట్ర ప్రజలు 2014, 2019లో బుద్ది చెప్పినా.. ఆమెలో మార్పు రాలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌పై ఇష్టారీతిన మాట్లాడితే ఊస్తూ ఊరుకోబోమంటూ పురంధేశ్వరికి వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని.

ఇదే సమయంలో చంద్రబాబుపైనా ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు కొడాలి నాని. చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయట ఉండటానికి గుండెకు రంద్రం పడిందంటూ నాటకాలు ఆడారని విమర్శించారు. ప్రజా ధనం దోచుకుని అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. అడ్డంగా దొరికిన దొంగ ఇప్పుడు ఆ తప్పుల నుంచి తప్పించుకోవడానికి అనేక డ్రామాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సీఎం జగన్ నాయతక్వంలో ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు పాలన అందిస్తుందన్నారని చెప్పారు.

Also Read:

అమ్మను చూసి చాలా నేర్చుకున్నాను..కూతురు పుట్టిన తరువాత జీవితమే: కేటీఆర్!

హీరో ధనుష్ కుమారుడికి షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. భారీ ఫైన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert:  ఉరుములు..మెరుపులు...ఏడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే?

వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది.

New Update
  Rain Alert For Telangana

Rain Alert

Rain Alert : వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే , మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది. రాబోయే ఏడు రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని ఈశాన్య, దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కు మార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!
 
ముఖ్యంగా అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అస్సాంలోని గౌహతిలో  భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెండు మూడు గంటల పాటు కురిసిన వర్షం కారణంగా.. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో రాబోయే 24 గంటల్లో అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో కూడా భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!
 
అయితే.. వాయువ్య బీహార్ మీదుగా తుఫాను ఏర్పడిందని.. ఇది మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడుతుంది. దీని ప్రభావంతో రాబోయే 7 రోజులు ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ నెల22 నుంచి27 మధ్య అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు నాగాలాండ్, మణిపూర్, మిజోరం మరియు త్రిపురలలో కూడా భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
 
ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

 

 

Advertisment
Advertisment
Advertisment