AP Politics: చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని.. మంత్రి కారుమూరి ఘాటు వ్యాఖ్యలు చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని మండిపడ్డారు మంత్రి కారుమూరి. చంద్రబాబుకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. ఆనాడు ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అంది బాబే అని అన్నారు. By V.J Reddy 16 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Karumuri Venkata Nageswara Rao: టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అంటూ మండిపడ్డారు. ఈ రోజు తణుకు మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో కారుమూరి మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. ఆనాడు ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అంది బాబే అని అన్నారు. ALSO READ: ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కర్ శుభవార్త.. రూ.12 వేలు.. ఎప్పటినుంచంటే? హోదా అంశాన్ని అటకెక్కించిన వ్యక్తి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. పోలవరం పూర్తికాని పాపం కూడా బాబుదే అని అన్నారు. పోలవరంలో ఏమీ చేయకుండా అంతా చేసేశానంటూ బాబు బిల్డప్ ఇచ్చారని తప్పుపట్టారు. మనుషుల్ని తీసుకెళ్లి మరీ భజన చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ ఊసెత్తే అర్హత బాబుకి లేదన్నారు. మా ప్రభుత్వంలో సచివాలయం రూపేణా లక్షల్లో ఉద్యోగాలిచ్చామని మంత్రి వెల్లడించారు. చంద్రబాబు హయంలో 11.8 శాతం పేదరికం ఉంటే, పేదరికాన్ని 6 శాతానికి తగ్గించిన ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డిదని (CM Jagan) వివరించారు. బాబు హయాంలో 17వ స్థానంలో విద్యావ్యవస్థ ఉందని ధ్వజమెత్తారు. జగనన్న విప్లవాత్మక మార్పులతో ఇప్పుడు మూడో స్థానంలో ఉందన్నారు. రెండకరాల రైతు అని చెప్పే చంద్రబాబు.. లక్ష కోట్లు ఎలా సంపాదించావని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ALSO READ: మా వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. హరీష్ సంచలన వ్యాఖ్యలు చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయగలరా?.. అంబటి కామెంట్స్ చంద్రబాబు మతిస్థిమితం లేకుండా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ అభ్యర్థుల మార్పుపై అనవసరపు కామెంట్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎందుకు చంద్రబాబు సింగిల్‌గా పోటీ చేయలేక పోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌లు సింగిల్‌గా పోటీ చేసే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. చంద్రబాబు, పవన్ పార్టీలను కాలగర్భంలో కలిపేయాలనే మా వ్యూహం అని తెలిపారు. 2024 ఎన్నికల తరువాత టీడీపీ భూస్థాపితం అవుతుందని జోస్యం చెప్పారు. #ap-news #chandrababu #cm-jagan #karumuri-venkata-nageswara-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి