Telangana Election 2023: కాంగ్రెస్, బీజేపీ హామీలకి ప్రజలు మోసపోవద్దు: మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరిక తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఇచ్చే హామీలకు మోసపోతే ఇబ్బది పడతామని గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ 11 డివిజన్‌లో ఆయన ప్రచారం నిర్వహించారు. బీజేపీ చెందిన డివిజన్ కార్పొరేటర్ గంగుల సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. By Vijaya Nimma 11 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Minister Gangula Kamalkar: కరీంనగర్ 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్ నాలుగో సారి ఎమ్మెల్యేగా గెలవాలని కట్టరాంపూర్‌లోని అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీ పార్టీకి చెందిన మహిళలు 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. అనంతరం ఆకుల నర్మదా నరసన్న ఇంటింటికి తిరుగుతూ మంత్రి గంగుల కమలాకర్ కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. Your browser does not support the video tag. ఇది కూడా చదవండి: చిన్న చిట్కాలతో వంటగది మెరిసిపోతుంది.. మొండి మరకలు కూడా మాయం అనంతరం అకుల నర్మద నర్సన్న మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని గంగుల కమలాకర్ అన్నా మల్లి గెలిపించాలన్నారు. లేకపోతే కరీంనగర్ అభివృద్ధి ఆగిపోతుందని ఆమె తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్‌ని తిరిగి మూడోసారి ముఖ్యమంత్రిగా చేయాలని నర్మద కోరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితబంధు, బీసీబందు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్, రైతు బీమా, రైతు బంధు, పేరుతో అనేక పథకాలు పెట్టి దేశంలోనే తెలంగాణ మెుదటి స్థానంలోకి తీసుకుని వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్‌ని కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ అన్న గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. Your browser does not support the video tag. తెలంగాణ మెుదటి స్థానంలో ఉంది మరోవైపు బండి సంజయ్ పలు విమర్శలు చేశారు. ఎంపీగా గెలిచిన తర్వాత బండి సంజయ్ ఎప్పుడైనా కనిపించాడా..? అంటూ స్థానికులను గంగుల ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా లేని తెలంగాణను ఊహించుకోలేమని భయంకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వ్యతిరేకులైన కిరణ్ కుమార్‌రెడ్డి, షర్మిల, కేవీపీ బీజేపీ, కాంగ్రెస్ ముసుగులో హైదరాబాద్‌లో అడ్డావేశారని ఆయన ఆరోపించారు. ఎవరన్ని చేసిన కేసీఆర్ మళ్లి మూడోసారి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని ఆయన పేర్కొన్నారు. #election-campaign #telangana-election-2023 #minister-gangula-kamalkar #karimnagar-11-division మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి