AP DSC: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్పీపై మంత్రి బొత్స కీలక ప్రకటన!

ఏపీ లో టీచర్‌ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న టీచర్‌ అభ్యర్థులకు రెండు మూడు రోజుల్లో ఓ కీలక నిర్ణయం గురించి ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు టీచర్‌ పోస్టుల గురించి ఓ నివేదిక సిద్దం చేసినట్లు మంత్రి తెలిపారు

New Update
Bosta: ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంపై బొత్స ఎమన్నారంటే?

AP DSC Notification: ఏపీలో టీచర్‌ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ గురించి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)  ఓ ప్రకటన చేశారు. దీంతో డీఎస్సీ గురించి ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. శుక్రవారం బొత్స మీడియాతో మాట్లాడుతూ...

మరో రెండు మూడు రోజుల్లో దీని గురించి ఓ స్పష్టమైన నిర్ణయం వస్తోందని బొత్స తెలిపారు. దీని గురించి జగన్‌ విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని మంత్రి వివరించారు. సీఎం (CM Jagan) ఆదేశాల మేరకు టీచర్‌ పోస్టుల గురించి ఓ నివేదిక సిద్దం చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత వివిధ దశల్లో టీచర్‌ పోస్టులను భర్తీ చేశామని వివరించారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో గత 25 రోజులుగా జరుగుతున్న అంగన్వాడీ సమ్మె గురించి మంత్రి బొత్స మాట్లాడారు..ప్రభుత్వం ఏర్పడిన తరువాత వెయ్యి రూపాయలు పెంచి 11 వేలు ఇస్తామన్నాం..అలాగే ఇస్తున్నాం. వారి మా ముందు పెట్టిన 10 డిమాండ్లను మేము ఒప్పుకున్నాం..ఈ సందర్భంలో వారు ప్రభుత్వ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని తెలిపారు.

Also read: షర్మిల పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం: ఏపీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు