Minister Ambati: బాలసౌరీ ఒక బఫున్.. మేం ఎన్నికలకు సిద్ధం..కానీ... ! ఏపీ ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉంది.. కానీ, టీడీపీ, జనసేన ఇంకా సీట్ల కోసం కొట్టుకుంటున్నాయిని కౌంటర్లు వేశారు మంత్రి అంబటి. సీట్లు రాని బఫున్స్ ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బాలసౌరీ ఒక బఫున్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. By Jyoshna Sappogula 05 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Minister Ambati: వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్దాలు ప్రచారం చేస్తోందన్నారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగనేనని కొనియాడారు. చంద్రబాబు 2014 నుండి 2019 వరకు మేనిఫెస్టో లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టో ను web సైట్ నుండి తొలగించిన చంద్రబాబును ప్రజలు ఎట్టి పరిస్థితిలోనూ నమ్మరని పేర్కొన్నారు. Also Read: ఉత్కంఠగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు..వాకౌట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..! అడుక్కోవడానికే.. ఇచ్చిన హామీలు అమలు చేసి.. ప్రజల దగ్గరకు వెళ్లి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి. సీట్లు అడుక్కోవడానికే చంద్రబాబు దగ్గరకు పవన్ వెళ్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని ఆయన వెంట వెళ్లొద్దని జనసైనికులకు సూచించారు. Also Read: టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు..ఇన్ని ఇవాల్సిందే అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..! బఫున్.. ఈ క్రమంలోనే జగన్ సక్సెస్ ఫుల్ సీఎం..చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం అని కౌంటర్ వేశారు. మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం..కానీ..టీడీపీ, జనసేన ఇంకా సీట్లు కోసం కొట్టుకుంటున్నాయిని కామెంట్స్ చేశారు. సీట్లు రాని బఫున్స్ ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బాలసౌరీ ఒక బఫున్ అంటూ ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించారు. అన్యాయాలు, అక్రమాలు చేశాడు కాబట్టే అక్కడ పడ్డాడని ఆరోపించారు. అందరిని ముంచిపోయాడని ఫైర్ అయ్యారు. జగన్ అర్జునుడని..అభిమన్యూడు కాదని వ్యాఖ్యనించారు. ప్రతిపక్షాల పద్మ వ్యూహాలను చేదించి భయటకు వస్తాడని ధీమా వ్యక్తం చేశారు. #andhra-pradesh #ap-minister-ambati-rambabu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి