Amarnath: ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. లోకేష్ కు మంత్రి అమర్నాథ్ సవాల్..!

రెండు రోజుల్లో టీడీపీ, జనసేన..NDA కూటమిలో చేరబోతున్నాయని మంత్రి అమర్నాథ్ కామెంట్స్ చేశారు. అన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వస్తాయని..సీట్లన్నీ బాబు డిసైడ్ చేస్తాడని పేర్కొన్నారు. ఎవరు ఎవరితో కలిసి వచ్చినా మా విధానంలో మార్పు లేదని చెప్పుకొచ్చారు.

New Update
Amarnath: ఆ కర్మ మా నాయకుడికి లేదు.. బీజేపీని ఎందుకు ఒప్పించలేకపొయారు..!

Minister Amarnath: విశాఖలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంత్రి అమర్నాథ్ నిప్పులు చెరిగారు. లోకేష్ కు కుండతో కందిపప్పు గిఫ్ట్ గా ఇస్తానని చురకలు వేశారు. లోకేష్ మంత్రి అయ్యాక ఎమ్మెల్సీ అయ్యాడని.. లోకేష్ లా నేను బ్యాక్ డోర్ రాజకీయ నేతను కాదని కామెంట్స్ చేశారు. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా లోకేష్ ఏమీ సాధించాడో చెప్పాలన్నారు.

రాజకీయాలు వదిలేస్తా..

లోకేష్ తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు మంత్రి అమర్నాథ్. లోకేష్ లేఖలు ఇస్తే ఉద్యోగాలు రావని..ప్రతిభ ఉంటే ఉద్యోగాలు వస్తాయని కామెంట్స్ చేశారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబుకి వచ్చిందా..? అని నిలదీశారు. లోకేష్ రాసుకున్న ఎర్ర బుక్కు తెరిచే అవకాశం రాదని..అది మడిచి ఎక్కడో దగ్గర పెట్టుకోవాలని ఎద్దేవ చేశారు.

Also Read: రాజమండ్రి జనసేన అభ్యర్థి ఇతనే..ఉత్కంఠకు తెరదించిన పవన్ కళ్యాణ్..!

నిన్న అనకాపల్లిలో గంజాయి డాన్ ను లోకేష్ తన పక్కన పెట్టుకున్నాడని..ఈ మాట గంటానే చెప్పాడని ఆరోపించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏమీ చేశారని నిలదీశారు. ఒక్క పోర్టు అయినా కట్టాలని ఎప్పుడైనా ఏమైనా ఆలోచన చేశాడా..? అని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉండగా ఉత్తరాంధ్రకు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు.

Also Read: రైతుల నిరసనను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి: తుమ్మల నాగేశ్వరరావు

ఈ సందర్భంగానే పొత్తులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యాలు చేశారు. రెండు రోజుల్లో టీడీపీ, జనసేన..ఎన్డీఏ కూటమిలో చెరబోతున్నాయని వ్యాఖ్యనించారు. అన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వస్తాయని..అప్పుడు సీట్లన్నీ బాబు డిసైడ్ చేస్తాడని పేర్కొన్నారు. అయితే, ఎవరు ఎవరితో కలిసి వచ్చినా.. మా విధానంలో ఏలాంటి మార్పు ఉండదని చెప్పుకొచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు