పెంపుడు కుక్క కోసం సంస్మరణ సభ..

మీరు పెంపుడు కుక్క పెంచుకుటున్నారా.? అయితే ఈ వార్త చదవాల్సిందే. పెంపుడు జంతువులు మన జీవితాలని అనందమయం చేసి ఆరోగ్యకర జీవనం గడపడంలో సాయపడతాయి. వాటిని ఇంటికి తెచ్చుకున్నాక చాలా సంతోషంగా ఉంటారు. మన మనస్సు బాగోలేనప్పుడు ఇవి మనల్ని నవ్వించి మనసు తేలికపడేటట్లు చేస్తాయి. కానీ అవి దూరం అయితే ఆ బాధ వర్ణతీతం.. ఓ పెంపుడు కుక్క యజమాని అందరికి అదర్శంగా నిలిచారు.

New Update
పెంపుడు కుక్క కోసం సంస్మరణ సభ..

పెంపుడు కుక్క కోసం

కుక్కలు, కుక్క పిల్లలు క్యూట్‌గా ఉంటాయి. ఏ జంతువైనా మన జీవన విధానంలోకి వస్తే మనలో ఒకటైపోతుంది. ఒక పెంపుడు జంతువుని పెంచుకుంటున్నప్పుడు మనం దానిమీద చాలా ప్రేమ చూపిస్తాం. ఇలా ఓ యాజమాని తన పెంపుడు కుక్కపై ఎంత ప్రేమ చూపించాడో చూడండి మీరే. చాలామందికి పెంపుడు జంతువులంటే ఎంతో అమితమైన ప్రేమ..ఇష్టం ఉంటుంది. వాటిని పెంచడం ఇంట్లో మనుషుల్లా సాకడం చేస్తూ ఉంటాం. అంతే కాదు వాటి ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది అయితే కొన్ని సార్లు నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు. ఓ యాజమాని మాత్ర తన పెంపుడు కుక్క కోసం చేసిన పనిని చూస్తే అందరూ షాక్ అవుతారు.

సంతాప సభ
తన పెంపుడు కుక్కకు సంస్మరణ సభ ఏర్పాటు చేసి గ్రామస్తులకు భోజనాలు పెట్టారు ఓ పెంపుకుక్క యజమాని. పశ్చిమగోదావరి జిల్లా పెనుమదం గ్రామానికి చెందిన ముద్దాల రాంబాబు గత 15 ఏళ్ళ క్రితం బంధువుల వద్ద నుంచి పెంపుడు కుక్కను తెచ్చుకున్నారు. దానికి సాయి అని పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి సాయి వారి కుటుంబంలో ఒక వ్యక్తిగా మారింది. అయితే కొన్ని రోజుల క్రితమే అనుకొని కారణం చేత ఆ పెంపుడు కుక్క మరణించింది. దానికి హిందూ సంప్రదాయ పద్ధతిలో అన్ని కార్యక్రమలు చేసి మరి.. గ్రామంలో  తన ఇంటి వద్ద పెంపుడు కుక్క అయిన సాయి ఫోటో ఏర్పాటు చేసి పెద్దలకు భోజనాలు పెట్టారు యజమాని రాంబాబు.

జాగ్రత్తలు తీసుకోవాలి

ఇంట్లో పెంచుకునే కుక్కపిల్లలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కుక్కల ఆరోగ్య విషయానికి వస్తే.. వాటి ఎదుగుదల, అనారోగ్య విషయాలపై సరైన అవగాహన ఉండటం తప్పనిసరి అంటున్నారు జంతు ప్రేమికులు. మనుషుల్లాగే, పెంపుడు జంతువులు కూడా పెద్దయ్యాక అనేక రకాల ఆరోగ్య పరిస్థితులకు లోనవుతాయి. కీళ్ల వ్యాధులు, గుండె జబ్బులు, డిమెన్షియా, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, కీళ్లనొప్పులు వంటివి కాలక్రమేణా వాటిని ప్రభావితం చేసే కొన్ని వ్యాధులు కూడా వస్తాయని చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు