Chiranjeevi: చిరంజీవి నుంచి ఒకేసారి 2 సినిమాలు: భోళాశంకర్ తర్వాత వరస సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి మంచి దూకుడు మీద ఉన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా రెండుకొత్త సినిమాలను ప్రకటించారు. ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఇందులో ఎలాంటి పొలిటికల్ అంశాలు, కాంట్రవర్సీలు లేకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

New Update
Chiranjeevi: చిరంజీవి నుంచి ఒకేసారి 2 సినిమాలు:   భోళాశంకర్ తర్వాత వరస సినిమాలు

Megastar planning 2 Movies: మెగాస్టార్ చిరంజీవి నుంచి మరో 2 సినిమాల ప్రకటనలు వచ్చేశాయి. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా, యూవీ క్రియేషన్స్  బ్యానర్ పై మరో సినిమా చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడీ రెండు నిర్మాణ సంస్థలు, చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాల్ని ప్రకటించాయి. ఆ వివరాలు చూద్దాం..

సుస్మిత నిర్మాణ సారధ్యంలో.. 

గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ (Gold Box Entertainments) బ్యానర్ పై చిరంజీవి హీరోగా సినిమా ప్రకటన వచ్చింది. చిరంజీవి కుమార్తె సుస్మిత.  ఈ ప్రాజెక్టుకు నిర్మాత. ఆమె ఈ బ్యానర్ చాన్నాళ్ల కిందటే పెట్టారు. ముందుగా వెబ్ సిరీస్ లు, ఆ తర్వాత చిన్న సినిమాలు తీశారు. ఇప్పుడు ఏకంగా తండ్రి చిరంజీవి హీరోగా ప్రాజెక్టు ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాకు కల్యాణకృష్ణ దర్శకత్వం వహిస్తాడు. కెరీర్ లో చిరంజీవికి ఇది 156వ చిత్రం.

ఫ్యాంటసీ కథాంశంతో 

ఇక చిరంజీవి తన 157వ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ (UV Creations)బ్యానర్ పై చేయబోతున్నారు. ఈ ప్రకటన కూడా వచ్చింది. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ హిట్టిచ్చిన వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై చిరంజీవి ఈ సినిమా చేయబోతున్నారు. ఈ మేరకు కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. బింబిసార తరహాలోనే ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా రాబోతోంది. పంచ భూతాల్ని చూపిస్తూ, క్రియేట్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

విరామం లేకుండా పని 

నిజానికి చిరంజీవి సినిమాలకు గ్యాప్ ఇస్తారని అంతా భావించారు. ఎఁదుకంటే, తాజాగా ఆయన నటించిన భోళాశంకర్ (Bholaa Shankar)సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమా దెబ్బతో మరోసారి ఆయన గ్యాప్ తీసుకుంటారని అంతా అనుకున్నారు. మరీ ముఖ్యంగా రీసెంట్ గా మోకాలికి సర్జరీ చేయించుకున్నారు చిరు. కాబట్టి కొన్నాళ్లు విరామం తీసుకుంటారని చాలామంది అనుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం తన జోరు కొనసాగించాలని నిర్ణయించారు.

డైలాగుల విషయంలోనూ జాగ్రత్త

తను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు చిరంజీవి. అయినప్పటికీ ఈమధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు, రాజకీయంగా దుమారం రేపాయి. ఇకపై అలాంటి కామెంట్స్ కూడా చేయకుండా, పూర్తిగా వివాదరహితంగా ఉండాలని చిరంజీవి భావిస్తున్నారు. తన సినిమాల్లో కూడా రాజకీయ ప్రస్తావనలు, పొలిటికల్ డైలాగ్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

Also Read: పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారీ షెడ్యూల్‌కు ఉస్తాద్ సిద్ధం

Advertisment
Advertisment
తాజా కథనాలు