Chiranjeevi: సీనియర్ రైటర్ పై మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారంటే..? మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో సీనియర్ రైటర్ సత్యానంద్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. సత్యానంద్.. సినిమా రంగంలో 50 వసంతాలు పూర్తిచేసుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సత్యానంద్ కు శుభాకాంక్షలు తెలుపుతూ.. మరో 50 ఏళ్లు ఇదే ఎనర్జీతో ఉండాలని కోరుకుంటున్నానంటూ తెలిపారు. By Jyoshna Sappogula 05 Oct 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో సీనియర్ రైటర్ అయిన సత్యానంద్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. తనకు అత్యంత ఆప్తుడు, ఎన్నో విజయవంతమైన సినిమాలకు స్క్రిప్ట్ సమకూర్చిన సత్యానంద్.. సినిమా రంగంలో 50 వసంతాలు పూర్తిచేసుకున్నారని చెప్పారు. ఈ యాభై ఏళ్ల ప్రస్థానంలో పదునైన డైలాగ్స్ రాసి, నేటి రచయితలకు, దర్శకులకు, నటులకు ఒక మెంటర్ గా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్ గా వుంటూ , ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటోర్ గా,ఒక గైడింగ్ ఫోర్స్ గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్ గా వుంటూ , సినిమాని ప్రేమిస్తూ , సినిమానే… pic.twitter.com/Tc7aphFOD2 — Chiranjeevi Konidela (@KChiruTweets) October 5, 2023 ఈ సందర్భంగా ఆయనకు హృదయ పూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు.. అంటూ చిరంజీవి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. చిరంజీవి సినీ జీవితంలో సత్యానంద్ పాత్ర కూడా ఉంది. ఈ క్రమంలోనే సత్యానంద్ కు శుభాకాంక్షలు తెలుపుతూ.. మరో 50 ఏళ్లు ఇదే ఎనర్జీతో ఉండాలని కోరుకుంటున్నానంటూ చిరంజీవి పేర్కొన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేష్ బాబు తదితర పెద్ద హీరోల సినిమాలకు సత్యానంద్ రైటర్ గా పనిచేశారు. ఇన్నేళ్లలో ఆయన 400 లకు పైగా సినిమాలకు పనిచేశారు. కొండవీటి సింహం, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, అంజి, టక్కరి దొంగ.. వంటి సినిమాలకు సత్యానంద్ కథను సమకూర్చారు. ఇటీవల కాలంలో వచ్చిన నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’, రవిబాబు ‘ఆవిరి’ సినిమాలకు స్క్రీన్ ప్లే అందించారు. Also Read: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు 2.0 గ్రాండ్ లాంచ్.. ఈ ఏడుగురి వైల్డ్ కార్డు ఎంట్రీ.. #tollywood #megastar-chiranjeevi #satyanad-script-writer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి