Pushpa 2: పుష్ప 2లో మెగాస్టార్.. పార్ట్ 1కు మించిన పార్ట్ 2 ప్లాన్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2'. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. ఫ‌స్ట్ పార్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం, సిరీస్ సినిమాల్లో భాగంగా 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకోడంతో 'పుష్ప 2' విష‌యంలో మేక‌ర్స్ ప్లాన్ మారింది. ఈ సారి అంత‌కు మించి అనే స్థాయిలో పార్ట్ 2ని ప్లాన్ చేస్తున్నారు. బ‌డ్జెట్ విష‌యంలోనూ రాజీప‌డ‌కుండా మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే పుష్ప 2లో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. తాజాగా పుష్ప‌రాజ్ యువ‌సేన తిరుప‌తి అంటూ మెగాస్టార్ ఇంద్ర పోస్ట‌ర్‌పై బ‌న్నీ ఉన్న ఓ క‌లౌట్ నెట్టింట వైర‌ల్ అవుతూ ఈ విష‌యంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

New Update
Pushpa 2: పుష్ప 2లో మెగాస్టార్.. పార్ట్ 1కు మించిన పార్ట్ 2 ప్లాన్..!!

Megastar Chiranjeevi in Pushpa 2:  ఫ‌స్ట్ పార్ట్‌ని 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో రూపొందించిన సుకుమార్ (Sukumar), ఇందులో చైల్ట్ ఎపిసోడ్‌ని కూడా చాలా ప‌ర్ ఫెక్ట్‌గా తెర‌కెక్కించి ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. డైలీ కూలీ అయిన ఓ యువ‌కుడు త‌నకు తండ్రి లేడ‌ని, స‌మాజం చిన్న చూపు చూసిన తీరుకు క‌సి పెంచుకుని స్మ‌గ్లింగ్ సిండికేట్‌కు నాయ‌కుడిగా ఎలా ఎదిగాడు? అనే క్ర‌మాన్ని పార్ట్ 1లో చూపించారు. ఇక పార్ట్ 2లో మాత్రం సిండికేట్‌కు లీడ‌ర్‌గా ఎదిగిన పుష్ప‌రాజ్ (Pushparaj) త‌రువాత స్మ‌గ్లింగ్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా ప్ర‌భావితం చేశాడు? ఎక్క‌డి వ‌ర‌కు త‌న నేర సామ్రాజ్యాన్ని విస్త‌రించాడు? అనే అంశాన్ని చ‌ర్చిస్తున్నారు.

Megastar Chiranjeevi in Pushpa 2

పార్ట్ 2లో అత్య‌ధిక భాగం 2000 సంవ‌త్స‌రం నేప‌థ్యంలో, కీల‌క ఘ‌ట్టాలు సాగుతాయ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల షూటింగ్ జ‌రుగుతోంది. అయితే ఈ క్ర‌మంలోనే ఇందులో మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర‌' (Indra Movie) ప్ర‌స్థావ‌న ఉంటుంద‌ని, ఇందులో బ‌న్నీ (Allu Arjun) మెగాస్టార్‌కు వీరాభిమానిగా క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. తాజాగా పుష్ప‌రాజ్ యువ‌సేన తిరుప‌తి అంటూ మెగాస్టార్ ఇంద్ర పోస్ట‌ర్‌పై బ‌న్నీ ఉన్న ఓ క‌టౌట్ నెట్టింట వైర‌ల్ అవుతూ ఈ విష‌యంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

Megastar Chiranjeevi in Pushpa 2

2000లో మెగాస్టార్ (Megastar Chiranjeevi) ఇండ‌స్ట్రీని రూల్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో మెగాస్టార్‌కు హార్డ్ కోర్ ఫ్యాన్‌గా పుష్ప‌రాజ్ క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. 'ఇంద్ర' రిలీజ్ టైమ్‌లో మెగాస్టార్ వీరాభిమానిగా, పుష్ప‌రాజ్ చేసే హంగామా అంతా ఇంతా కాద‌ని, దీనికి సంబంధించిన సీన్‌ల‌ని ప్ర‌స్తుతం చిత్రీక‌రిస్తున్నార‌ట‌. రియల్ లైఫ్ లోను బ‌న్నీ మెగాస్టార్‌కు వీరాభిమాని అన్న విష‌యం తెలిసిందే. వెండితెర‌పై కూడా హార్డ్ కోర్ అభిమానిగా బ‌న్నీ కనిపించ‌నుండ‌టంతో, అభిమానులు స్క్రీన్‌పై బ‌న్నీ ఎలా క‌నిపించ‌నున్నాడా? అని మెగా ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read: నేషనల్ అవార్డ్ అందుకున్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు