Varun Tej : వరద బాధితులకు వరుణ్ తేజ్ విరాళం.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరద బాధితుల కోసం తన వంతు సాయంగా రూ.15 లక్షలు డొనేట్ చేశారు. అందులో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ.5 లక్షలు, పంచాయితీ రాజ్ శాఖకు రూ. 5 లక్షలు.. మొత్తం రూ.15 లక్షలు విరాళంగా అందిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. By Anil Kumar 05 Sep 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Varun Tej : తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ అంతా కదిలొస్తోంది. అగ్ర హీరోల నుంచి యువ హీరోల వరకు ఒక్కొక్కరుగా తమ వంతు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్,రామ్ చరణ్ ఇలా చాలా మంది స్టార్స్ విరాళం ప్రకటించగా.. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సైతం తన వంతు సాయంగా రూ.15 లక్షలు డొనేట్ చేశారు. వరదల వలన రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బంది పడుతున్న ప్రజల సహాయం కోసం… నా వంతు బాధ్యతగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ.5 లక్షలు… మరియు గౌరవ AP డిప్యూటీ CM శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించిన పంచాయితీ రాజ్ శాఖకు రూ. 5 లక్షలు , మొత్తం రూ. 15 లక్షలు విరాళంగా… — Varun Tej Konidela (@IAmVarunTej) September 5, 2024 Also Read : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.' వరదల వలన రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బంది పడుతున్న ప్రజల సహాయం కోసం నా వంతు బాధ్యతగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిసహాయ నిధికి చెరొక రూ.5 లక్షలు.. గౌరవ AP డిప్యూటీ CM శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించిన పంచాయితీ రాజ్ శాఖకు రూ. 5 లక్షలు.. మొత్తం రూ. 15 లక్షలు విరాళంగా అందిస్తున్నాను. ఈ కష్టకాలంలో అందరం ఒకరికొకరం అండగా ఉండాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు. #varun-tej మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి