Medaram Jatara: మేడారంలో 9 కి.మీ. ట్రాఫిక్ జామ్.. పోటెత్తిన భక్తులు

ఆదివాసుల ఆరాధ్య దైవాల సన్నిధికి భక్తులు పోటెత్తుతున్నారు. మేడారంలో కొలువైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి ఇప్పటినుంచే తరలివస్తున్నారు. జాతర మొదలవడానికి ఇంకా చాలా రోజుల సమయం ఉండగానే అక్కడ సందడి మొదలైంది.

New Update
Medaram Jatara: మేడారంలో 9 కి.మీ. ట్రాఫిక్ జామ్.. పోటెత్తిన భక్తులు

Medaram Jatara: ఆదివాసుల ఆరాధ్య దైవాల సన్నిధికి భక్తులు పోటెత్తుతున్నారు. మేడారంలో కొలువైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి ఇప్పటినుంచే తరలివస్తున్నారు. జాతర మొదలవడానికి ఇంకా చాలా రోజుల సమయం ఉండగానే అక్కడ సందడి మొదలైంది. వరుస సెలవుల నేపథ్యంలో ఆదివారం రోజు 9 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోవడం గమనార్హం. మధ్యాహ్నం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. జంపన్న వాగు నుంచి చింతల్ ఎక్స్ రోడ్ వరకు వాహనాలు నిలిచిపోయాయి.

ఇదిలా ఉంటే, మేడారం పరిసరాల్లో భారీగా తాగునీటి కొరత ఉందంటున్నారు భక్తులు. దీంతో జాతర పూర్తిస్థాయిలో మొదలైతే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. అధికార యంత్రాంగం దృష్టి సారించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు మంత్రులు సీతక్క, కొండా సురేఖ దగ్గరుండి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా, ముందస్తుగానే లక్షలాదిగా భక్తులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చే ఈ మహోత్సవానికి ఈ నెల 30లోగా ఏర్పాట్లు పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. వచ్చే నెల 21 నుంచి జాతర మొదలు కాబోతోంది. ఈ సారి కోటి మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. కేసీఆర్‌కు షాక్?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment