షాకింగ్ న్యూస్.. కొండచరియలు విరిగిపడి 2 వేల మంది మృతి!

శుక్రవారం జరిగిన పపువా న్యూగినీలోని కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 2 వేలకు చేరింది. మారుమూల ప్రాంతం కావడంతో పాటు 26 అడుగుల ఎత్తు వరకు చెత్తాచెదారం పేరుకుపోవడంతో రెస్క్యూ టీంకు సహాయక చర్యల పై తీవ్ర జాప్యం జరుగుతుంది.

New Update
షాకింగ్ న్యూస్.. కొండచరియలు విరిగిపడి 2 వేల మంది మృతి!

పాపువా న్యూ గినియా దీవులు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఇండోనేషియాకు తూర్పున ఉన్నాయి. ఈ ప్రదేశం పర్వతాలు, అడవులు  అనేక నదులను కలిగి ఉంది. 1.17 మిలియన్ల ప్రజలు నివసించే పాపువా న్యూగినీలో 850 భాషలు మాట్లాడతారు. దీంతో అత్యధిక భాషలు మాట్లాడే దేశంగా కూడా ఘనత సాధించింది.ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గత వారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు దేశంలోని ఉత్తరాన ఉన్న యంబాలి గ్రామం గుండా చాలా మంది ప్రజలు నిద్రిస్తున్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు రెండు అంతస్తుల ఎత్తులో ఉన్న శిథిలాల కింద 150కి పైగా ఇళ్లు సమాధి అయ్యాయి.దీంతో  ప్రజలు వాటి  శిథిలాల మధ్య చిక్కుకున్నారు.యంబాలి గ్రామం మారుమూల కావడంతో రెస్క్యూ టీమ్‌కు చేరుకోవడానికి చాలా సమయం పట్టింది.  ఈ ఘటనలో ఇప్పటి వరకు 2 వేలకు పైగా మరణించారని పాపువా న్యూగినీకు చెందిన UN అధికారి సెర్హాన్ అక్టోబ్రాక్ తెలిపారు. ఈ ఘటన ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.

publive-image

26 అడుగుల ఎత్తు వరకు భారీ రాళ్లు, చెట్లు, మట్టి పేరుకుపోయి ఉన్నాయి. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో గిరిజనులు నిరసనలు తెలుపుతున్నారు. అలాగే రోడ్లపై శిథిలాలు పడి ఉండడంతో సహాయక సిబ్బంది వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. దీంతో రెస్క్యూ టీం  వెళ్లేందుకు పపువా న్యూగినీ ఆర్మీ అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.బాధిత ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు