Tirumala Updates: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ నెల 21 నుంచి.. శ్రీవారి భక్తులకు మార్చి నెలకు సంబంధించిన సేవా టికెట్లను విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి దర్శనం, ఆర్జితా సేవా టికెట్ల వివరాలను ఆన్‌లైన్ లో టికెట్ల వివరాలను ప్రకటించింది. By Bhavana 17 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Tirumala: వచ్చే ఏడాది మార్చి నెలకు సంబంధించిన ఆన్ లైన్ టికెట్లను (Online tickets) టీటీడీ (TTD) విడుదల చేసింది. శ్రీవారి దర్శనం, ఆర్జితా సేవా టికెట్ల వివరాలను ఆన్‌లైన్ లో టికెట్ల వివరాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ముఖ్య తేదీలను కూడా టీటీడీ తెలిపింది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవాలని వివరించారు. డిసెంబర్ 18 వ తేదీ ఉదయం 10 నుంచి 20 వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవా టికెట్ల లక్కీడీప్ (Lucky deep) కోసం భక్తులు నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. డిసెంబర్ 21 వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. డిసెంబర్ 21 వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి తెప్పోత్సవాల టికెట్లను కూడా భక్తులకు అందుబాటులోకి ఉంచనున్నట్లు అధికారులు వివరించారు. డిసెంబర్ 21 మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలు అయినటువంటి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ వివరించింది. డిసెంబర్ 23న ఉదయం అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటా , మధ్యాహ్నం 3 గంటలకు వృద్దులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. డిసెంబర్ 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు. ఇక డిసెంబర్ 27 న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతి శ్రీవారి సేవా టికెట్ల కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. Also read: ఈసారి బిగ్‌బాస్ లో రచ్చ చేసిన జంట ఎవరంటే! #tirumala #ttd #seva-tickets #imp-dates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి