loksabha: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఖరారు.. ఉద్యోగులకు సెలవులు రద్దు! లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చి 13న లేదంటే 14న ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉండగా.. ఏప్రిల్ 11న పోలింగ్ జరగబోతున్నట్లు చర్చ నడుస్తోంది. తెలంగాణలో మార్చి 8, 9, 10 తేదీల్లో ఉద్యోగులకు సెలవులను రద్దు చేసినట్లు సమాచారం. By srinivas 08 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Parliament: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సంకేతాలు కూడా వచ్చాయని, దీంతో పెండింగ్ పనులు, శంకుస్థాపనలు వెంటనే చేపట్టాలని ప్రభుత్వ అధికారులను కలెక్టర్లు ఆదేశించినట్లు సమాచారం. అయితే ఎన్నికల షెడ్యూల్ తర్వాత కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉండకపోవడంతో నిత్యం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సభలతో సీఎం రేవంత్ రెడ్డి బిజి బిజీగా గడుపుతున్నారు. ఏప్రిల్ 11న పోలింగ్.. ఈ మేరకు ఈ నెల 13న లేదంటే 14న ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉండగా.. 2024లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగబోతున్నట్లు చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్లు ఉద్యోగులకు సెలవులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ సిబ్బందికి సెలవులను రద్దు చేసిన కలెక్టర్లు.. 8, 9, 10 తేదీల్లో సెలవు పెట్టడానికి వీల్లేదంటూ ఆదేశాలు సైతం జారీ చేశారట. ఇక ఈ ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. రేవంత్ రెడ్డి సర్కారుతో పాటు రాష్ట్రంలోని పార్టీలు విస్తృత కార్యాచరణ మొదలుపెట్టగా.. ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కేడర్‌తో పరుగులు పెట్టిస్తున్నారు. ఇది కూడా చదవండి: Sudha Murty : రాజ్యసభకు సుధా మూర్తి.. మోదీ ఏం అన్నారంటే? దేశమంతటా కోడ్ అమల్లోకి.. అలాగే ఈ షెడ్యూల్ జారీతో దేశమంతటా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుండగా.. కేంద్ర, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోనున్నాయి. దీంతో చిన్న చిన్న ప్రారంభోత్సవాల రహస్యంగా పూర్తి చేస్తున్నారు నాయకులు. జిల్లాల స్థాయిలో పూర్తిచేయాల్సిన పనులపై కూడా దృష్టిపెట్టిన అధికారులు ఈనెల 12 కల్లా పెండిగ్ పనులన్నీ పూర్తి చేయడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. #schedule #lok-sabha-election #march-13 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి