Manu Bhaker : ఈ సినిమాకు ఒలింపిక్ మెడల్ ఇవ్వాలి.. బాలీవుడ్ మూవీపై మను భాకర్ ప్రశంసలు, రియాక్ట్ అయిన హీరో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన 'చందు ఛాంపియన్' మూవీపై ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ ప్రశంసలు కురిపించారు. తన ఇన్ స్టా స్టోరీలో..' ఈ సినిమా నేను అనుకున్నదానికంటే చాలా ఎక్కువగా నచ్చింది. సినిమాలో నటించినందుకు అతడికి ఒలింపిక్ మెడల్ ఇవ్వాలి' అంటూ పేర్కొన్నారు. By Anil Kumar 14 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Manu Bhaker : బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ తన తాజా చిత్రం 'చందు ఛాంపియన్' లోని నటనకు ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా ఒలింపిక్ పతక విజేత మాను భాకర్ సైతం కార్తిక్ నటనను మెచ్చుకున్నారు. దీనికి స్పందిస్తూ కార్తిక్ ఆర్యన్ మాను భాకర్ కు ధన్యవాదాలు తెలిపారు. మను భాకర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'చందు ఛాంపియన్' చిత్రాన్ని చూసిన తర్వాత కార్తిక్ ఆర్యన్ పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె ఇన్ స్టా స్టోరీలో.." ఒలింపిక్స్ ముగిసింది. నేను ఇంటికి వచ్చిన వెంటనే #చందుఛాంపియన్ చూశాను. ఈ సినిమా నేను అనుకున్నదానికంటే చాలా ఎక్కువగా నాకు నచ్చింది. ఈ పాత్రను అంత సమర్థవంతంగా పోషించినందుకు కార్తీక్ ఆర్యన్ కి థ్యాంక్స్. ఒక అథ్లెట్ పాత్రలో నటించడం అంత సులభం కాదు. ఈ సినిమమాలో నటించినందుకు అతడికి ఒలింపిక్ మెడల్ ఇవ్వాలి" అని రాశారు. Also Read : బ్యాక్ టూ యాక్షన్.. అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన వెంకీ మామ, వీడియో వైరల్! కాగా మను భాకర్ ప్రశంసలకు స్పందిస్తూ కార్తిక్ ఆర్యన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 'వావ్.. థ్యాంక్ యూ మాను భాకర్, మీలాంటి నిజమైన ఛాంపియన్ మా సినిమాని ప్రశంసించినప్పుడు ఈ క్షణాలు నేను ఎప్పటికీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను' అని తెలిపారు. భారతదేశంలోని మొదటి పారాలింపిక్స్ బంగారు పతక విజేత మురళీకాంత్ పెట్కర్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించారు. #manu-bhaker #chandu-champion సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి