AP: సీఎం జగన్ కు చిత్తశుద్ధి లేదు.. బుద్ధి చెబుతాం: మందకృష్ణ

ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంపై ఎమ్మార్పీఎస్‌ నాయకుడు మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ పాలనలో మాదిగలకు సంక్షేమం లేకుండా పోయిందని విమర్శించారు. తన మద్దతు కూటమికే ఉంటుందని, ఈసారి జగన్ ను ఓడించి తగిన బుద్ధి చెబుతామన్నారు.

New Update
AP: సీఎం జగన్ కు చిత్తశుద్ధి లేదు.. బుద్ధి చెబుతాం: మందకృష్ణ

Mandakrishna: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపై ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పాలనలో మాదిగలకు సంక్షేమం లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. గడిచిన ఐదేళ్లలో జగన్ తమ జాతికి ఎలాంటి మేలు చేయలేదని, మరోసారి గెలిచిన తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. జగన్ ను ఓడించి తగిన బుద్ది చెబుతామన్నారు.

తగిన బుద్ధి చెబుతాం..
ఈ మేరకు మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని అంబేడ్కర్‌ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మందకృష్ణ.. మాదిగల సంక్షేమం పట్ల సీఎంకు చిత్తశుద్ధి లేదన్నారు. ఇటీవల ప్రకటించిన పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల్లో కూడా మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి తగిన బుద్ధి చెబుతామని చెప్పారు.

ఇది కూడా చదవండి: TS: కేసీఆర్ లాగే మీరూ చేయండి.. కాంగ్రెస్ కు హరీష్ రావు కీలక సూచన!

కూటమికే మద్ధతు..
అలాగే సీఎం జగన్‌ ప్రభుత్వంలో దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలు పూర్తిగా రద్దయ్యాయని ఆరోపించారు. విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్‌ పేరు తీసేసి జగన్‌ పేరు పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఏపీలో గత ప్రభుత్వం మాదిగ కులానికి ప్రాధాన్యతనిచ్చిందని గుర్తు చేశారు. ఇక నరేంద్ర మోడీ కూడా తమను గుర్తించారని, అందుకే ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి తన మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు