TS RTC: సీట్లన్నీ ఆడవాళ్లకేనా!.. బస్సుకు అడ్డం నిలుచున్న మగజాతి ఆణిముత్యం

తెలంగాణలో మహిళలందరికీ బస్సులో ప్రయాణం ఫ్రీ కదా. అందరూ పోటీ పడి బస్సులెక్కేసరికి వారే నిండిపోతున్నారు. రోజూ బస్సుల్లో తిరిగే పురుషులు సీట్లే దొరకడం లేదని వాపోతున్నారు. ఇదే విషయమై ఆర్మూరులో ఓ యువకుడు బస్సుకు అడ్డంగా నిలుచుని నిరసన తెలపడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
TS RTC: సీట్లన్నీ ఆడవాళ్లకేనా!.. బస్సుకు అడ్డం నిలుచున్న మగజాతి ఆణిముత్యం

TS RTC: ‘‘మహిళలను గౌరవించడం మన సంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’’... ఆర్టీసీ బస్సుల్లో సీట్ల వెనుక రోజూ చూసే కొటేషనే ఇది. అయితే, ఇప్పుడు దాన్ని ‘‘మగవాళ్లకు కూడా కొన్ని సీట్లను వదిలేయండి’’ అని రిక్వెస్ట్ చేస్తూ రాయాలేమో అంటున్నారు కొందరు సీటు దొరకని బాధిత పురుషులు. తెలంగాణలో ఇప్పుడు మహిళలందరికీ బస్సులో ప్రయాణం ఫ్రీ కదా. అందరూ పోటీ పడి బస్సులెక్కేసరికి మొత్తం వారే నిండిపోతున్నారు. ఇక తమకు సీట్లెక్కడ ఉంటాయంటూ వాపోతున్నారు.

ఇది కూడా చదవండి: భక్తుల్లా బిల్డప్.. చేసేవేమో ఇలాంటి పనులు.. వీళ్ల ప్లాన్ చూసి పోలీసులే షాకయ్యారు!

ఇదే విషయమై శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో వాసు అనే వ్యక్తి ఇదే డిమాండ్ చేస్తూ బస్సుకు అడ్డంగా నిలుచున్నాడు. ఆర్టీసీ బస్సులో మహిళల తరహాలో పురుషులకు కూడా కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అందరి దృష్టిలో పడ్డాడు. ఈ యువకుడు చేపట్టిన ఈ వినూత్న నిరసన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ అయ్యింది.

ఇది కూడా చదవండి: ఫినాలేకు ముందే 10 లక్షల ఆఫర్.. శివాజీ చేతిలో సూట్ కేస్..!

బస్సులో 30 సీట్లుంటే 20 మహిళలకు, 10 మగవాళ్లకు కేటాయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. సీట్లన్నీ ఆడవాళ్లకే కేటాయిస్తే మగవాళ్లు ఎక్కడ కూర్చోవాలని నిలదీస్తున్న అతడి వీడియో కింద సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ‘‘నువ్వు మగజాతి ఆణిముత్యం బ్రో’’ అంటూ ఫన్నీగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు