Beauty Tips: కీరాతో ఎన్నో లాభాలు.. ఓ లుక్కేయండి! కీరా దోసకాయ తింటే కడుపు చల్లగా ఉంటుంది. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. ముఖం మీద బ్లాక్ హెడ్స్ ఉంటే కీరాను ముక్కలుగా కట్ చేసి మసాజ్ చేయాలి. కీరా కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ ను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 27 Aug 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Beauty Tips: నిగనిగలాడే చర్మం కావాలా..? అయితే కీరాతో మీ కోరికి నేరవేరుతుంది. ముఖ అందం కోసం అన్ని ప్రయత్నలు చేసి అలిసిపోయిన వాళ్లకు కీరా బెస్ట్ అని చర్మ నిపుణులు చెబుతున్నారు. కీరదోస ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికి తెలుసు. దీనిని తింటే శరీరం, కడుపు చల్లగా ఉంటుంది. అందుకే వీటికి వేసవిలో ఎక్కువగా తింటారు. అయితే కీరాతో ఆరోగ్యంతోపాటు, చర్మానికి కూడా మేలు జరుగుతుంది. వీటిని వాడటం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుందట. మరి కీరాలో చర్మ చిట్కాలు ఏం ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. నిగనిగలాడే చర్మం కోసం చిట్కాలు: నిమ్మకాయ రసంతో ముఖంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి వదిలిస్తుంది. అందుకని ప్రతిరోజూ నిమ్మరసాన్ని ముఖానికి రాసుకుంటే నిగనిగలాడే చర్మం పొందవచ్చు. ముఖానికి తులిసి కూడా మేలు చేస్తాయి. వీటిని ముందు ఎండబెట్టి పొటిగా చేసుకోవాలి. కొన్ని నీళ్లలో కలిపి పెస్ట్‌లా చేసి ముఖానికి ప్యాక్‌గా వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. కొందరి ముఖం మీద బ్లాక్ హెడ్స్ ఉంటాయి. అలాంటి వారు కీరదోస ముక్కను ముఖంపై మసాజ్ చేయాలి. ఇది కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ తగ్గేందుకు కీరదోస బాగా పని చేస్తుంది. కీరదోసను కనురెప్పలపై పెట్టినా కళ్లకు మంచిది. టొమాటోలో విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది. ఇది ముఖానికి నేచురల్ బ్లీచ్‌గా పని చేస్తుంది. టొమాటో ముక్కలను తగిరి, రసం తీసి దాని ఉప్పు కాలపాలి. ఈ పెస్ట్‌ను ముఖంపై సున్నితంగా మద్దన చేయాలి. ఇలా చేస్తే డెడ్ సెల్స్‌ను తొలుగుతుంది. ఉప్పు చర్మ రంధ్రాలను శుభ్రం చేసి చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడటంతో సహాయ పడుతుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: శనగపిండి, తేనెతో మీ చర్మ సౌందర్యాన్ని ఇలా బెటర్‌గా చేసుకోండి! #beauty-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి