Sitara Dance Video: నాన్న పాటకు స్టెప్పులేసిన మహేశ్ ముద్దుల కూతురు.. ధమ్ మసాలా వీడియో వైరల్!

మహేశ్ కూతురు సితార గుంటూరు కారంలోని 'ధమ్ మసాలా" పాటకు స్టెప్పులేసింది. ఆరెంజ్ కలర్ దోతి, వైట్ కలర్ షర్ట్, ధరించి మహేష్ బాబు లా మాస్ స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన సితార.. డాడీ ఇది నీకోసమే అంటూ క్యాప్షన్ జోడించింది.

New Update
Sitara Dance Video: నాన్న పాటకు స్టెప్పులేసిన మహేశ్ ముద్దుల కూతురు.. ధమ్ మసాలా వీడియో వైరల్!

Mahesh Babu Daughter Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు ఘట్టమనేని సితార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సితార చిన్నప్పటి నుంచే సెలబ్రెటీల మారిపోయింది. హీరో మహేష్ బాబు కూతురిగా మాత్రమే కాదు.. చిన్న వయసు నుంచే ఛారిటీలు, సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ కనిపించే సితార.. తన డాన్స్ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గతంలో సితార చేసిన కొన్ని డాన్స్ వీడియోలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా తన తండ్రి మహేష్ బాబు పాటకు సితార (Sitara Ghattamaneni) చేసిన డాన్స్ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతుంది.

మహేష్ బాబు పాటకు సితార డాన్స్

ఇటీవలే రిలీజైన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సితార ఘట్టమనేని గుంటూరు కారంలోని 'ధమ్ మసాలా' (Dum Masala Song) పాటకు స్టెప్పులేసింది. ఆరెంజ్ కలర్ దోతి, వైట్ కలర్ షర్ట్, ధరించి మహేష్ బాబు లా మాస్ స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన సితార.. డాడీ ఇది నీకోసమే అంటూ క్యాప్షన్ జోడించింది. సితార డాన్స్ వీడియో చూసిన మహేష్ అభిమానులు సూపర్, క్యూట్, అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె వేసిన డాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Also Read: Vishwambhara: 18 ఏళ్ల తర్వాత.. మెగాస్టార్‌తో మళ్లీ జత కట్టిన ఆ స్టార్ హీరోయిన్

publive-image

రీసెంట్ గా సితార నటించిన PMJ జ్యూలర్స్ యాడ్.. న్యూ యార్క్ టైమ్స్ బిల్ బోర్డు పై కనిపించింది. దీనికి సంబంధించి.. మహేష్ బాబు తన సోషల్ మీడియా వేదిక పై వీడియోను షేర్ చేసి.. చాలా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. డాన్స్ అంటే బాగా ఇష్టపడే సితార కొరియోగ్రాఫర్ అనీ తో డాన్స్ నేర్చుకుంటోంది. చాలా సార్లు అనీ మాస్టర్ తో కలిసి చేసిన డాన్స్ వీడియోలను సితార తన సోషల్ మీడియా వేదికపై చేసింది.

Also Read: This Week OTT Release: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు .. ఓటీటీ ప్రియులకు పండగే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

cinema గంజాయితో దొరికిపోయిన ఇద్దరు డైరెక్టర్లు!

మలయాళం డైరెక్టర్లు అష్రఫ్ హమా, ఖలీద్ రెహమాన్ గంజాయితో దొరికిపోయారు. అర్థరాత్రి స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్ లో గంజాయి తీసుకుంటుండగా కొచ్చి పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 1.5gms గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఖలీద్ 'జింఖానా' మూవీ ఇటీవలే విడుదలైంది.

New Update
Khalid Rehman Ashraf Hama

Khalid Rehman Ashraf Hama

మలయాళం డైరెక్టర్లు అష్రఫ్ హమా, ఖలీద్ రెహమాన్ గంజాయితో దొరికిపోయారు. అర్థరాత్రి స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్ లో గంజాయి తీసుకుంటుండగా కొచ్చి పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 1.5gms గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

telugu-news | latest-news | director Ashraf Hamza | director Khalid Rahman | ganja | malayalam-industry

Advertisment
Advertisment
Advertisment