Maharashtra Govt: మహాసర్కార్ కీలక నిర్ణయం..బ్రిటీష్ కాలం నాటి 8 రైల్వే స్టేషన్ల పేర్లు మార్పు..! బ్రిటీష్ కాలం నాటి 8 రైల్వే స్టేషన్ల పేర్లను మార్చుతూ మహారాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ సంస్కృతిని, చరిత్రను స్వీకరించడానికే ఈ పేర్లను మార్చినట్లు పేర్కొంది. పేర్లు మార్చిన 8 రైల్వే స్టేషన్ల కొత్త పేర్లు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 13 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Maharashtra Govt: మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబై నగరంలో బ్రిటీష్ కాలం నాటి 8 రైల్వే స్టేషన్ల పేర్లను మార్చుతూ మహారాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ సంస్కృతిని, చరిత్రను స్వీకరించడానికే ఈ పేర్లను మార్చినట్లు పేర్కొంది. పేర్లు మార్చిన 8 రైల్వే స్టేషన్లు ఇవే. కొత్త పేర్లు ఇవే. - కాటన్ గ్రీన్- కాలాచౌకి -చర్ని రోడ్- గిర్గావ్ - డాక్‌యార్డ్ రోడ్- మజ్‌గావ్ -కింగ్ సర్కిల్- తీర్థకర్ పార్శివనాథ్ - కర్రీ రోడ్- లాల్‌బాగ్ -శాండ్‌హర్స్ట్ రోడ్- డోంగ్రీ -మెరైన్ లైన్స్- ముంబాదేవి అంతేకాకుండా, రైల్వే మంత్రిత్వ శాఖ నుండి అనుమతి కోసం పెండింగ్‌లో ఉన్న ముంబై సెంట్రల్ స్టేషన్‌కు నానా జగన్నాథ్ శంకర్‌షెత్ స్టేషన్ అనే కొత్త పేరు పెట్టనుంది. ఈ నిర్ణయం మహారాష్ట్ర గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని భావిస్తున్నారు.జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మహారాష్ట్ర భవన్‌ను నిర్మించేందుకు 2.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదన ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీ మునుపటి సెషన్‌లో రాష్ట్ర బడ్జెట్‌లో చేర్చింది. కాగా అహ్మద్ నగర్ పేరును అహల్యానగర్ గా మారుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 18వ శతాబ్దపు మరాఠా రాణి అహల్యాబాయి హెల్కర్ పేరు మీదుగా అహల్యానగర్ గా మార్చుతూ మహారాష్ట్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. నగరానికి పేరు మార్చాలనే ప్రభుత్వ ప్రతిపాదనను మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే గతేడాది మేలో తొలిసారిగా ప్రకటించారు. ఇది కూడా చదవండి: అహ్మద్‌నగర్‌కు ‘అహల్యానగర్’గా పేరు మార్చిన మహారాష్ట్ర సర్కార్..! #eknath-shinde #mumbai-news #mumbai-local-train మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి