Lake: కోరికలను తీర్చే అద్భుత సరస్సు.. ఎక్కడో తెలుసా?

సిక్కింలోని అందమైన లోయలలో ఉన్న ఖెచెయోపల్రి సరస్సు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సును కోరికలు తీర్చే సరస్సు అని కూడా అంటారు. దీనిలోకి దిగి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందన్న ప్రచారం ఉంది. దీంతో నిత్యం అనేక మంది ఈ సరస్సును సందర్శిస్తారు.

New Update
Lake: కోరికలను తీర్చే అద్భుత సరస్సు.. ఎక్కడో తెలుసా?

Lake: వర్షాకాలంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు,వారి భాగస్వాములతో కలిసి అందమైన లోయలను సందర్శించాలని నిర్ణయించుకుంటారు. కానీ గమ్యస్థానం కారణంగా చాలా సార్లు ప్లాన్‌లు రద్దు అవుతుంది. ఈ రోజు స్వర్గం కంటే తక్కువ లేని ప్రదేశం గురించి చెబుతాము. అంతే కాదు వర్షాకాలంలో స్వర్గాన్ని చూస్తున్నట్లుగా అనుభూతి చెందుతారు. సిక్కింలోని అందమైన లోయలలో ఉన్న ఖెచెయోపల్రి సరస్సు రహస్యమైన, మంత్రముగ్ధులను చేసే అందాలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సును కోరికలు తీర్చే సరస్సు అని కూడా అంటారు. ఈ సరస్సులో ఏదైనా కోరిక కోరినా, చేసినా అది నెరవేరుతుందని అక్కడని ప్రజలు చెబుతున్నాయి.

కోరిక నెరవేరుతుంది:

  • ఖేచోపాల్రి గ్రామంలో ఉన్నఈ సరస్సుని కోరికలు తీర్చే సరస్సు అని పిలుస్తారు. ఈ సరస్సులో కోరికలను కోరుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సరస్సులలో ఒకటిగా చెబుతారు.
  • దీన్ని చూడాలంటే అడవిలాంటి దారి గుండా వెళ్లాలి. సహజ సౌందర్యం హృదయాన్ని గెలుచుకుంటుంది. ఈ సరస్సు చుట్టూ షికారు చేయడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఈ సరస్సు దగ్గర డుపుక్ని అనే గుహ కూడా ఉంది. ఈ గుహలో శివుడు తపస్సు చేసినట్లు ప్రతీతి.
  • ఇక్కడ సమీపంలోని అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ సరస్సును చూసిన తర్వాత గాంగ్టక్ చేరుకోవచ్చు. ఇక్కడ మొదటి రోజు హోటల్‌లో బస చేసి సమీపంలోని స్థానిక మార్కెట్‌లకు వెళ్లి అక్కడ వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
  • మనన్ ఆలయం, నామ్‌గ్యాంగ్ స్థూపాన్ని కూడా సందర్శించవచ్చు. ఇక్కడికి చేరుకోవడానికి ఇంటికి సమీపంలోని విమానాశ్రయం నుంచి గ్యాంగ్‌టక్ విమానాశ్రయానికి రావచ్చు. సమీప రైల్వే స్టేషన్ నుంచి నయా బజార్ రైల్వే స్టేషన్ గాంగ్టక్ చేరుకోవచ్చు.

సందర్శించే ప్రదేశాలు:

  • ఇక్కడికి చేరుకున్న తర్వాత టాక్సీ, రిక్షా, బస్సు, సులభంగా ఖేచెయోపాల్రి చేరుకోవచ్చు. ఇక్కడికి రావడానికి ఉత్తమ సమయం వర్షాకాలం. ఇక్కడికి వచ్చిన తర్వాత గాంగ్టక్ రాయల్ ప్యాలెస్, బాబా మంగు భవన్, త్సో లా లేక్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: చివరి మంగళ గౌరీ వ్రతాన్ని జరుపుకోండిలా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: పోలీసింగ్‌లో నెంబర్‌ వన్‌గా తెలంగాణ..

తెలంగాణలో పోలీసుశాఖ పనితీరు దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌-2025’ పేరుతో టాటా ట్రస్ట్‌ మంగళవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.

New Update
Telangana Police

Telangana Police

తెలంగాణలో పోలీసుశాఖ పనితీరు దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌-2025’ పేరుతో టాటా ట్రస్ట్‌ మంగళవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ప్రజలకు న్యాయం అందించే పోలీసులు, కోర్టులు, జైళ్లు, న్యాయసాయం లాంటి విభాగాల పనితీరును అధ్యయనం చేసిన టాటా ట్రస్ట్ 2019 నుంచి ర్యాంకింగ్‌ ఇస్తూ వస్తోంది. సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్ వెల్త్ హ్యూమన్‌ రైట్స్ ఇనిషియేటివ్ సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్‌వెల్త్‌ హ్యూమన్ రైట్స్‌ సంస్థల సహకారంతో తాజా రిపోర్టును తయారుచేసింది. 

Advertisment
Advertisment
Advertisment